తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iqoo Z9x Launch : ఇండియాలో ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

iQOO Z9x launch : ఇండియాలో ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Sharath Chitturi HT Telugu

07 May 2024, 13:45 IST

  • iQOO Z9x : ఇండియాలో ఐక్యూ జెడ్9ఎక్స్ లాంచ్ డేట్ ఖరారైంది. అయితే.. అధికారిక లాంచ్​కు ముందే పలు ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..
ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. (IQOO/X)

ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

iQOO Z9x price in India : ఇంటర్నెట్​లో అనేక లీక్స్​, పుకార్ల కారణంగా ఐక్యూ జెడ్9ఎక్స్​పై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు.. ఎట్టకేలకు రాబోయే ఐక్యూ జెడ్ 9ఎక్స్ లాంచ్ తేదీని ప్రకటించింది సంస్థ. పవర్​ఫుల్​ స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో మిడ్ రేంజ్ సెగ్మెంట్​లో ఈ స్మార్ట్​ఫోన్​ అరంగేట్రం చేయనుంది. ఐక్యూ జెడ్9ఎక్స్ లాంచ్ తేదీ మే 16, 2024. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తదితరాల వివరాలను ఇక్కడ చూడండి..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఐక్యూ జెడ్9ఎక్స్ లాంచ్ డేట్..

చైనీస్ స్మార్ట్​ఫోన్ బ్రాండ్ ఐక్యూ తన రాబోయే ఐక్యూ జెడ్ 9ఎక్స్ స్మార్ట్​ఫోన్​ లాంచ్ తేదీని వెల్లడిస్తూ ఎక్స్ పోస్ట్​ను పంచుకుంది. ఐక్యూ జెడ్9ఎక్స్ స్మార్ట్​ఫోన్​ని మే 16, 2024న భారత్​లో అధికారికంగా లాంచ్​ చేస్తున్నారు. ఇప్పటికే చైనా, మలేషియాలో అరంగేట్రం చేసిన ఈ స్మార్ట్​ఫోన్​ ఇప్పుడు నిర్ణీత తేదీన భారత్​లో లాంచ్ కానుంది. లాంచ్ తేదీతో పాటు, ఈ స్మార్ట్​ఫోన్​.. అమెజాన్​లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని ఐక్యూ ధృవీకరించింది. 

ఐక్యూ జెడ్9ఎక్స్ స్పెసిఫికేషన్లు..

iQOO Z9x launch date India : ఐక్యూ జెడ్9ఎక్స్​లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో కూడిన 6.72 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ డిస్​ప్లే ఉండనుంది. ఈ స్మార్ట్​ఫోన్..​1080×2408 పిక్సెల్ రిజల్యూషన్​ని సపోర్ట్ చేస్తుంది. క్వాల్కం స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 చిప్​సెట్​తో పనిచేసే ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ కూడా ఉండే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టెంపై ఐక్యూ జెడ్9ఎక్స్ పనిచేస్తుంది. అంతేకాకుండా, ఈ స్మార్ట్​ఫోన్​లో డ్యూయల్ కెమెరా సెటప్​ ఉంటుది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండొచ్చు. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఐక్యూ జెడ్9ఎక్స్​లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

iQOO Z9x specifications : అయితే.. ప్రస్తుతం ఇవి రూమర్స్​గానే ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​పై లాంచ్​ టైమ్​కి అన్ని వివరాలు బయటకు వస్తాయి. ధరకు సంబంధించిన వివరాలుపైనా ఓ క్లారిటీ వస్తుంది.

బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కొనాలా..?

Vivo Y18 launch : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో వరుస లాంచ్​లతో వివో సంస్థ మంచి జోరు మీద ఉంది! తాజాగా మరో రెండు స్మార్ట్​ఫోన్స్​ని లాంచ్​ చేసింది. అవి.. వివో వై18, వివో వై18ఈ. ఇవి బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​గా వచ్చాయి. ఈ స్మార్ట్​ఫోన్స్​లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. డ్యూయెల్ రియర్ కెమెరాలు, విలక్షణమైన వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉన్న ఈ రెండు డివైజ్​లు.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత యూఐతో పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండు గ్యాడ్జెట్స్​కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం