Top camera smartphones : రూ. 20వేల బడ్జెట్​లో టాప్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​ ఇవే..-top camera smartphones under 20000 in 2024 check full list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Top Camera Smartphones Under 20000 In 2024 Check Full List Here

Top camera smartphones : రూ. 20వేల బడ్జెట్​లో టాప్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Mar 16, 2024 01:09 PM IST

Top camera smartphones under Rs. 20000 : రూ. 20వేల బడ్జెట్​లో, మంచి కెమెరా క్వాలిటీతో కూడిన స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే! టాప్​- 3 కెమెరా స్మార్ట్​ఫోన్స్​ 2024 లిస్ట్​ని ఇక్కడ చూసేయండి.

రూ. 20వేల బడ్జెట్​లో బెస్ట్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​...
రూ. 20వేల బడ్జెట్​లో బెస్ట్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​... (unsplash)

Best camera smartphones under Rs. 20000 : మంచి కెమెరా క్వాలిటీ ఉండే స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అది.. బడ్జెట్​లో మంచి గ్యాడ్జెట్​ ఉంటే బాగుండు.. అని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! 2024లో.. రూ. 20వేల బడ్జెట్​లో టాప్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు

రియల్ మీ 12 ప్లస్ 5జీ- రూ.18,999..

రియల్ మీ 12 ప్లస్ 5జీలో ప్రీమియం డిజైన్, అద్భుతమైన కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ ఎల్వైటీ-600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇందులో ఉంటుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, బ్యూటిఫుల్​ పోర్ట్రెయిట్ షాట్లను క్లిక్​ చేయవచ్చు. విజువల్ ఎంటర్​టైన్​మెంట్ కోసం 6.67 ఇంచ్​ 120 హెచ్​జెడ్​ అల్ట్రా స్మూత్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ చిప్​సెట్ తో వంటివి ఈ స్మార్ట్​ఫోన్​లో ఉన్నాయి. పయనీర్ గ్రీన్, నావిగేటర్ బీజ్ కలర్స్​లో లభించే ఈ ఫోన్.. 8 జీబీ+128 జీబీ, 8 జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్లను అందిస్తోంది.

ఫీచర్స్​స్పెసిఫికేషన్స్​..
ధరRs.  18,999   
కెమెరా సెటప్​Triple: 50MP primary, 8MP Ultra-Wide, 2MP Macro
సెల్ఫీ కెమెరా16MP
డిస్​ప్లే6.67-inch 120Hz Ultra Smooth OLED
ప్రాసెసర్​MediaTek Dimensity 7050 5G 

ఐక్యూ జెడ్ 9 5జీ- రూ.19,999..

iQOO Z9 price in India : ఐక్యూ జెడ్9 5జీ.. సొగసైన డిజైన్, అద్భుతమైన కెమెరా పనితీరుతో ఆకట్టుకుంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్-882 కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటివి ఇందులో ఉన్నాయి. దీని 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ + అమోఎఈడీ డిస్ప్లే విజువల్ ఎక్స్​పీరియన్స్​ని మెరుగుపరుస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్​సెట్​ స్మూత్ ఆపరేషన్​ని నిర్ధారిస్తుంది. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 44వాట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. బ్రష్డ్ గ్రీన్, గ్రాఫీన్ బ్లూ రంగుల్లో లభించే ఈ ఫోన్​లో.. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.

ఫీచర్స్​స్పెసిఫికేషన్స్​
ధర Rs.  19,999
కెమెర సెటప్​Triple: 50MP main, 2MP depth, 16MP front 
డిస్​ప్లే6.67-inch FHD+ AMOLED 
ప్రాసెసర్​MediaTek Dimensity 7200
  

రెడ్ మీ నోట్ 13 5జీ- రూ.17,999..

Redmi Note 13 5G specifications : రెడ్​మీ నోట్ 13 5జీ ఆకర్షణీయమైన కెమెరా సామర్థ్యాలతో సొగసైన డిజైన్ కలిగి ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఈ స్మార్ట్​ఫోన్​లో ఉన్నాయి. దీని 6.67 ఫుల్​ హెచ్​డీ+ అమోఎఈడీ డిస్ప్లే ఆకర్షణీయమైన దృశ్య అనుభవాన్ని అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్​తో పర్ఫార్మెన్స్​ మెరుగ్గా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఛార్జింగ్​ వంటివి ఇతర ఫీచర్స్​. స్టెల్త్ బ్లాక్, ప్రిజం గోల్డ్, ఆర్కిటిక్ వైట్ రంగుల్లో లభించే ఈ ఫోన్.. 6 జీబీ+128 జీబీ, 8 జీబీ+256 జీబీ, 12 జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఫీచర్స్​స్పెసిఫికేషన్స్​
ధరRs.  17,999 
కెమెరా సెటప్​Quad: 108MP main, 8MP Ultra-Wide, 2MP macro, 16MP front
డిస్​ప్లే 6.67-inch FHD+ AMOLED
ప్రాసెసర్​MediaTek Dimensity 6080

2024లో మంచి కెమెరా క్వాలిటీ కలిగిన స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తుంటే.. పైన చెప్పిన మూడు ది బెస్ట్​ ఆప్షన్స్​ అవుతాయి. పైగా.. వీటి ధరలు రూ.20వేల కన్న తక్కువే!

WhatsApp channel

సంబంధిత కథనం