Redmi Note 12 : రెడ్​మీ నోట్​ 12పై భారీ తగ్గింపు​.. అతి తక్కువ ధరకే బెస్ట్​ ఫీచర్స్​!-redmi note 12 4g receives a significant price cut in india now available under 10000 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi Note 12 : రెడ్​మీ నోట్​ 12పై భారీ తగ్గింపు​.. అతి తక్కువ ధరకే బెస్ట్​ ఫీచర్స్​!

Redmi Note 12 : రెడ్​మీ నోట్​ 12పై భారీ తగ్గింపు​.. అతి తక్కువ ధరకే బెస్ట్​ ఫీచర్స్​!

Sharath Chitturi HT Telugu

Redmi Note 12 price drop : రెడ్​మీ నోట్​ 12 సిరీస్​ ధరలను మరింత తగ్గించింది స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. ఫలితంగా.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ సెగ్మెంట్​లో పోటీ మరింత పెరిగింది.

రెడ్​మీ నోట్​ 12పై భారీ డిస్కౌంట్​.. అతి తక్కువ ధరకే బెస్ట్​ ఫీచర్స్​!

Redmi Note 12 price in India : షావోమీ తన రెడ్​మీ నోట్ 12 4జి సిరీస్ ధరను భారీగా తగ్గించింది. ఈ సిరీస్​ ఇప్పుడు భారతదేశంలో రూ .10,499 నుంచి ప్రారంభమవుతుంది. గత ఏడాది మార్చ్​లో లాంచ్ అయ్యింది ఈ స్మార్ట్​ఫోన్. కాగా.. 3 నెలల్లోనే రెండుసార్లు ధరను తగ్గించింది స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. ఫలితంగా.. బడ్జెట్​ ఫ్రెండ్లీ, రూ. 10వేల బడ్జెట్​ ధరలో లభించే స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో పోటీ మరింత పెరిగింది!

లాంచ్​ సమయమలో.. రెడ్​మీ నోట్ 12 4జీ 6 జీబీ ర్యామ్ /64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 గాను, 6 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గాను ఉండేది. అనంతరం.. జనవరిలో ఈ రెండు ఫోన్ల ధరలను రూ.2,000 తగ్గించింది సంస్థ.

తాజా తగ్గింపుతో.. రెడ్​మీ నోట్ 4జీ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 గాను, 6జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999కు చేరింది. ఫ్లిప్​కార్ట్​లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి స్మార్ట్​ఫోన్​ కొంటే.. మరో రూ .1,500 వరకు 10% తగ్గింపును కూడా పొందొచ్చు. ఈ ఆఫర్​ని కూడా కలుపుకుంటే.. వీటి ధరలు వరుసగా రూ .11,597 (రూ .49 ప్యాకింగ్ ఫీజుతో సహా). రూ .9,597 గా ఉన్నాయి.

రెడ్ మీ నోట్ 12 4జీ స్పెసిఫికేషన్లు:

Redmi Note 12 features : రెడ్​మీ నోట్ 12 4జీలో 6.67 ఇంచ్​ ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 1080x2400 పిక్సెల్స్ రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 685 ప్రాసెసర్, అడ్రినో 610 జీపీయూ ఆపరేటింగ్ సిస్టెంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే, మిడ్-రేంజ్ స్మార్ట్​ఫోన్స్​లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. మీ సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాల కోసం ఫోన్​లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. పోర్ట్రెయిట్, నైట్ మోడ్, ప్రో మోడ్, డాక్యుమెంట్ మోడ్, షార్ట్ వీడియో, పనోరమ, కస్టమ్ వాటర్మార్క్, మూవీ ఫ్రేమ్, టిల్ట్ షిఫ్ట్, వాయిస్ షట్టర్, టైమ్డ్ బర్స్ట్, బ్యూటీఫై మరియు మరెన్నో కెమెరా యాప్లో మీకు అవసరమైన అన్ని మోడ్లు సైతం లభిస్తున్నాయి.

బడ్జెట్​ ఫ్రెండ్లీ రెడ్​మీ నోట్ 12 4జీ స్మార్ట్​ఫోన్​లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది.

ఈ గ్యాడ్జెట్స్​కి ఇప్పటికే మంచి డిమాండ్​ ఉంది. తాజాగా.. ధర తగ్గడంతో డిమాండ్​ మరింత పెరుగుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత కథనం