Lava Blaze Curve 5G : బడ్జెట్ ఫ్రెండ్లీ లావా బ్లేజ్ కర్వ్.. త్వరలోనే లాంచ్!
Lava Blaze Curve 5G launch date in India : లావా బ్లేజ్ కర్వ్.. త్వరలోనే ఇండియాలో లాంచ్ అవ్వనుంది. ఫీచర్స్, ధర లీక్ అయ్యాయి. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..
Lava Blaze Curve 5G launch date : లావా బ్లేజ్ కర్వ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుందని టాక్ నడుస్తోంది. లాంచ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. ఈ మొబైల్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్, ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..
లావా బ్లేజ్ కర్వ్- ఫీచర్స్ ఇవేనా!
ఆన్లైన్లో లీక్ అయిన డేటా ప్రకారం.. లావా బ్లేజ్ కర్వ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.
Lava Blaze Curve 5G price : ఇక కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ. 16వేలు- రూ. 19వేల మధ్యలో ఉంటుంది. ఇందులో రెండు కలర్ ఆప్షన్స్ ఉండొచ్చు.
లీక్స్ ప్రకారం.. ఈ లావా బ్లేజ్ కర్వ్ మార్చ్ మొదటి వారంలో ఇండియాలో లాంచ్ అవ్వొచ్చు. ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 64 ఎంపీ ప్రైమరీతో కూడిన రేర్ కెమెరా వస్తుంది! ఫ్రెంట్ కెమెరాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.
Lava Blaze Curve kab launch hoga : ఈ మోడల్‌కి సంబంధించిన ఇతర ఫీచర్స్, ధర, లాంచ్ డేట్‌పై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
లావా బ్లేజ్ 2 ఫీచర్స్ ధరని చెక్ చేశారా?
మరోవైపు.. లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్.. గతేడాది నవంబర్‌లో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. దీని బేస్ వేరియంట్ ధర రూ. 9999. దీనికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇందులో 6.56 ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీతో కూడిన డ్యూయెల్ రేర్ కెమెరా వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ ప్రాసెసర్ దీని సొంతం. 6జీబీ ర్యామ్-128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ గ్యాడ్జెట్‌కి లభిస్తోంది.
Lava Blaze Curve 5G full specifications : బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఈ మొబైల్‌కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. మరి త్వరలోనే లాంచ్ అవుతున్న లావా బ్లేజ్ కర్వ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఏ మేరకు ప్రదర్శన చేస్తుందో చూడాలి!
సంబంధిత కథనం