Lava Blaze 2 Pro : బడ్జెట్​ ఫ్రెండ్లీ లావా బ్లేజ్​ 2 ప్రో లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే!-lava blaze 2 pro launched in india check features price and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lava Blaze 2 Pro : బడ్జెట్​ ఫ్రెండ్లీ లావా బ్లేజ్​ 2 ప్రో లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే!

Lava Blaze 2 Pro : బడ్జెట్​ ఫ్రెండ్లీ లావా బ్లేజ్​ 2 ప్రో లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Sep 11, 2023 03:11 PM IST

Lava Blaze 2 Pro : Lava Blaze 2 Pro : బడ్జెట్​ ఫ్రెండ్లీ లావా బ్లేజ్​ 2 ప్రో లాంచ్​ అయ్యింది. ఈ గ్యాడ్జెట్​ ధర, ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

బడ్జెట్​ ఫ్రెండ్లీ లావా బ్లేజ్​ 2 ప్రో లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే!
బడ్జెట్​ ఫ్రెండ్లీ లావా బ్లేజ్​ 2 ప్రో లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే!

Lava Blaze 2 Pro : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​ అడుగుపెట్టింది. అదే లావా బ్లేజ్​ 2 ప్రో. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త స్మార్ట్​ఫోన్​లోని ఫీచర్స్​ ఇవే..

లావా బ్లేజ్​ 2 ప్రోలో సెంటర్​ అలైన్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​ ఉంటుంది. కర్వ్​డ్​ డిస్​ప్లే ఎడ్జెస్​ లభిస్తున్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​, ఫేస్​ అన్​లాక్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.

ఈ కొత్త మొబైల్​లో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.5 ఇంచ్​ ఐపీఎస్​ ఎల్​సీడీ (720x1600 పిక్సెల్స్​) డిస్​ప్లే వస్తోంది. ఈ గ్యాడ్జెట్​ బరువు 190గ్రాములు. డైమెన్షన్స్​.. 163ఎంఎంx75.2ఎంఎంx8.5ఎంఎం.

ఈ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డ్యూయెల్​ సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ కెమెరా సెటప్​ వస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఫ్రెంట్​లో 8ఎంపీ కెమెరా లభిస్తోంది.

ఇదీ చూడండి:- Oppo A38 : ఒప్పో ఏ38 లాంచ్​.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఎలా ఉంది?

ఈ లావా బ్లేజ్​ 2 ప్రో మోడల్​లో 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వస్తోంది. మైక్రోఎస్​డీ కార్డ్​తో స్టోరేజ్​ని ఎక్స్​ప్యాండ్​ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తోంది సంస్థ. ఇక ఈ మోడల్​.. ఆండ్రాయిడ్​ 12 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 18వాట్​ ఫాస్ట్​ ఛార్జిగ్​ సపోర్ట్​ దీని సొంతం. ఈ మొబైల్​లో యునీఎస్​ఓసీ టీ616 చిప్​సెట్​ వస్తోంది. 4జీ ఎల్​టీఈ, బ్లూటూత్​ 5.0, జీపీఎస్​, వైఫై, టైప్​-సీ పోర్ట్​, 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జాక్​ వంటివి కనెక్టివిటీ ఫీచర్స్​గా ఉన్నాయి.

కొత్త స్మార్ట్​ఫోన్​ ధర ఎంతంటే..!

లావా బ్లేజ్​ 2 ప్రో 3 కలర్స్​లో అందుబాటులోకి వచ్చింది. అవి థండర్​ బ్లాక్​, కూల్​ గ్రీన్​, స్వాగ్​ బ్లూ. ఇక ఈ మొబైల్​ ధర రూ. 9,999. ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో ఈ గ్యాడ్జెట్​.. పోటీని మరింత పెంచుతుందని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మొబైల్​కు మంచి డిమాండ్​ లభిస్తుందని సంస్థ కూడా ఆశిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం