తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nissan 7 Seater Mpv : నిస్సాన్​ నుంచి 7 సీటర్​ ఎంపీవీ.. త్వరలోనే లాంచ్!

Nissan 7 seater MPV : నిస్సాన్​ నుంచి 7 సీటర్​ ఎంపీవీ.. త్వరలోనే లాంచ్!

Sharath Chitturi HT Telugu

07 February 2023, 13:56 IST

    • Nissan to launch new 7 seater MPV : నిస్సాన్​ నుంచి త్వరలో ఒక 7 సీటర్​ ఎంపీవీ రానుంది. ఇది రెనాల్ట్​ ట్రైబర్​ను పోలి ఉంటుందని తెలుస్తోంది.
 నిస్సాన్​ నుంచి 7 సీటర్​ ఎంపీవీ.. త్వరలోనే లాంచ్
నిస్సాన్​ నుంచి 7 సీటర్​ ఎంపీవీ.. త్వరలోనే లాంచ్ (REUTERS)

నిస్సాన్​ నుంచి 7 సీటర్​ ఎంపీవీ.. త్వరలోనే లాంచ్

Nissan to launch new 7 seater MPV : ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థలు రెనాల్ట్​, నిస్సాన్​లు తమ భాగస్వామ్య ఒప్పందంలో కీలక మార్పులు చేసుకున్న అనంతరం.. ఇండియా మార్కెట్​పై దృష్టి సారించాయి! ఈ క్రమంలోనే ఇండియాలో వరుసగా వాహనాలను లాంచ్​ చేసేందుకు ఈ సంస్థలు భారీగా ప్లాన్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు.. ఓ కొత్త 7 సీటర్​ ఎంపీవీని ఇండియాలో త్వరలోనే లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది నిస్సాన్​. ఈ ఎంపీవీ.. రెనాల్ట్​ ట్రైబర్​ను పోలి ఉంటుందని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Discounts on Hyundai cars: ఎక్స్టర్ ఎస్యూవీ సహా టాప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హ్యుందాయ్

2024 Maruti Suzuki Swift: 2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ రేపు లాంచ్: టాప్ మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్ ఇదే..

EPFO alert: ఉద్యోగులకు షాక్; గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

Aadhar Housing IPO: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ప్రారంభం; అప్లై చేయొచ్చా?.. నిపుణులేమంటున్నారు?

ట్రైబర్​.. డస్టర్​.. నిస్సాన్​..!

ఎంపీవీతో పాటు పలు ఎస్​యూవీలను కూడా ఇండియాలోకి తీసుకురానున్నట్టు నిస్సాన్​ ప్రకటించింది. మరోవైపు న్యూ జెన్​ రెనాల్ట్​ డస్టర్​ లాంచ్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎస్​యూవీని 5 సీటర్​తో పాటు 7 సీటర్​ వేరియంట్​లలో లాంచ్​ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెనాల్ట్​ పేరు మీద ఉన్న డస్టర్​కు.. సొంతం వర్షెన్​లో నిస్సాన్​ కూడా మరో పేరుతో లాంచ్​ చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Nissan Renault partnership : ఇండియా ఆటోమొబైల్​లో ఏ సెగ్మెంట్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​పైనా రెనాల్ట్​, నిస్సాన్​లు దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగానే బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​ రెనాల్ట్​ క్విడ్​కు ఈవీ టచ్​ ఇచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్​లో ఈ రెనాల్ట్​ క్విడ్​ ఈవీని ఇప్పటికే లాంచ్​ చేసింది ఆటో సంస్థ.

పోర్ట్​ఫోలియోలోని మోడల్స్​ ఇవే..

ప్రస్తుతానికైతే.. రెనాల్ట్​ పోర్ట్​ఫోలియోలో క్విడ్​, ట్రైబర్​, కైగర్​ మోడల్స్​ ఉన్నాయి. కైగర్​కు ఇండియా మార్కెట్​లో విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. కాంపాక్ట్​ ఎస్​యూవీ మోడల్​ కావడం ఇందుకు కారణం. రెనాల్ట్​ లైనప్​లో క్విడ్​ మోస్ట్​ అఫార్డిబుల్​ మోడల్​గా కొనసాగుతోంది.

Renault Triber on road price in Hyderabad : ఇక నిస్సాన్​ కిక్స్​, మాగ్నైట్​లు సైతం ఇండియా రోడ్ల మీద తిరుగుతున్నాయి. నిస్సాన్​ మాగ్నైట్​ రెనాల్ట్​ ట్రైబర్​ను కాస్త పోలి ఉంటుంది. ఈ రెండింట్లో వినియోగిస్తున్న ప్లాట్​ఫామ్​, ఇంజిన్​, గేర్​బాక్స్​ ఒకటే. మరోవైపు ఎక్స్​-ట్రైల్​ ఎస్​యూవీని ఇండియా మార్కెట్​లో లాంచ్​ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించింది నిస్సాన్​ సంస్థ.

టాపిక్