తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New 2023 Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్ వచ్చేసింది.. రేంజ్, ఫీచర్స్ అప్‍డేట్లతో..

New 2023 Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్ వచ్చేసింది.. రేంజ్, ఫీచర్స్ అప్‍డేట్లతో..

03 March 2023, 6:17 IST

    • 2023 Bajaj Chetak Electric Scooter: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 2023 వెర్షన్ విడుదలైంది. ప్రస్తుత మోడల్‍తో పోలిస్తే ఎక్కువ రేంజ్, ఫీచర్ల అప్‍గ్రేడ్లతో అడుగుపెట్టింది.
New 2023 Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్ వచ్చేసింది
New 2023 Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్ వచ్చేసింది (HT Auto)

New 2023 Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్ వచ్చేసింది

2023 Bajaj Chetak Electric Scooter: పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘బజాజ్ చేతక్‍’కు 2023 అప్‍గ్రేడెడ్ వెర్షన్ వచ్చింది. కొన్ని డిజైన్ స్టైలింగ్ మార్పులు, అప్‍గ్రేడెడ్ ఫీచర్లతో అడుగుపెట్టింది. అలాగే ప్రస్తుతం ఉన్న మోడల్ ధరను కాస్త తగ్గించింది బజాజ్. ఈ నయా 2023 చేతక్ (2023 Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది. ప్రస్తుత మోడల్‍తో పోలిస్తే ఎక్కువ రేంజ్‍ను కలిగి ఉంది. 2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలివే..

మార్పులివే..

2023 Bajaj Chetak Electric Scooter: ప్రస్తుతం మోడల్‍తో పోలిస్తే 2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వెర్షన్‍లో డిజైన్‍లో పెద్దగా మార్పులు లేకపోయినా.. స్టైలింగ్‍లో కొన్ని ఛేంజెస్ ఉన్నాయి. స్టాండర్డ్ వెర్షన్‍తో పోలిస్తే ఈ 2023 మోడల్‍కు కాస్త పెద్ద సైజ్ ఎల్‍సీడీ డిజిటల్ డిస్‍ప్లే ఉంది. డిస్‍ప్లే రౌండ్ షేప్‍లోనే ఉంది. ఈ కొత్త మోడల్ మ్యాట్ కోర్స్ గ్రే, మ్యాట్ కరేబియన్ బ్లూ, సాటిన్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులోకి వచ్చింది. బాడీ కలర్డ్ రేర్ వ్యూ మిర్రర్లు, ప్రీమియమ్ టూ టోన్ సీట్, సాటిన్ బ్లాక్ గ్రాబ్ రెయిల్‍ను ఈ స్కూటర్ కలిగి ఉంది. ఇండికేటర్లు, సెంట్రల్ ట్రిమ్ ఎలిమెంట్స్ ఇప్పుడు చార్కోల్ బ్లాక్ ఫినిష్‍తో ఉన్నాయి. దీంతో కొత్త మోడల్ లుక్ కాస్త విభిన్నంగా ఉంటుంది.

మరింత రేంజ్

2023 Bajaj Chetak Electric Scooter: ప్రస్తుతం ఉన్న వెర్షన్‍తో పోలిస్తే 2023 బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 20 శాతం ఎక్కువ రేంజ్‍ను ఇస్తుంది. 2023 మోడల్‍ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ (ARAI సర్టిఫైడ్) ఉంటుందని బజాజ్ వెల్లడించింది. ప్రస్తుత మోడల్ రేంజ్ 90 కిలోమీటర్లుగా ఉంది. అయితే రెండు వెర్షన్‍లలో 2.88 కిలో వాట్ బ్యాటరీ (kWh) బ్యాటరీనే ఉంటుంది. అలాగే 4.2kW (5.3 bhp) పీఎంఎస్ మోటార్ ఉంటుంది. ఇది 20Nm పీక్ టార్క్ టార్క్యూను జనరేట్ చేయగలదు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు (70 kmph). బ్యాటరీ సామర్థ్యంలో మార్పు లేకపోయినా.. సాఫ్ట్ వేర్ అప్‍గ్రేడ్ల కారణంగా 2023 చేతక్ ఎక్కువ రేంజ్‍ను ఇస్తుంది.

2023 Bajaj Chetak Electric Scooter: ఇక ఆల్‍మెటల్ బాడీతోనే ఈ 2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. ఈ స్కూటర్ బ్యాటరీ నాలుగు గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ ఉండదు.

2023 బజాజ్ చేతక్ ధర

2023 Bajaj Chetak Electric Scooter Price: 2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.52లక్షలు (ఎక్స్ షో-రూమ్)గా ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్ బుకింగ్‍లను బజాజ్ మొదలుపెట్టింది. ఏప్రిల్ నుంచి డెలివరీలు ఇవ్వనుంది. ఇక ప్రస్తుత చేతక్ మోడల్ ధర రూ.1.22లక్షల (ఎక్స్ షోరూమ్)కు బజాజ్ తగ్గించింది.

Bajaj Chetak Electric Scooter: ప్రస్తుతం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలోని 60 సిటీల్లో లభిస్తోంది. మార్చిలోగా దేశంలోని 85 నగరాల్లో 100 స్టోర్లలో అందుబాటులోకి తెస్తామని బజాజ్ ప్రకటించింది. వీటిలో 40 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉంటాయని వెల్లడించింది.