Okaya Faast F2F Electric Scooter: ఒకాయా నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: బడ్జెట్ రేంజ్‍లో..
21 February 2023, 12:23 IST
- Okaya Faast F2F Electric Scooter: ఒకాయా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. బడ్జెట్ రేంజ్‍లో ఇది అడుగుపెట్టింది. 80 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుంది.
Okaya Faast F2F Electric Scooter: ఒకాయా నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్
Okaya Faast F2F Electric Scooter: ఒకాయా ఈవీ (Okaya EV) సంస్థ మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఒకాయా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ (Okaya Faast F2F) పేరుతో ఈ నయా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. బడ్జెట్ రేంజ్‍లో ఇది అడుగుపెట్టింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ స్కూటర్‌పై 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. ఒకాయా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి వివరాలు ఇవే.
బ్యాటరీ, రేంజ్
Okaya Faast F2F Electric Scooter: 2.2 కిలో వాట్ హవర్ (60V36Ah) లిథియమ్ అయాన్ బ్యాటరీని ఒకాయా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని ఒకాయా పేర్కొంది. 800W బీఎల్‍డీసీ మోటార్‌ను ఈ స్కూటర్ కలిగి ఉంది. బ్యాటరీ, మోటార్‌కు రెండు సంవత్సరాల వారెంటీ ఉంటుంది. ఇక ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు (55 kmph)గా ఉంటుంది.
మూడు డ్రైవింగ్ మోడ్స్
Okaya Faast F2F Electric Scooter: ఒకాయా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు డ్రైవింగ్ మోడ్‍లతో వస్తోంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఈ స్కూటర్‌కు ఉండే 2.2 kWh బ్యాటరీ నాలుగు నుంచి ఐదు గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది.
ఫీచర్లు
Okaya Faast F2F Electric Scooter: ఫుల్లీ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, రిమోట్ కీ, డీఆర్ఎల్ హెడ్‍ల్యాంప్స్, ఎడ్జీ టైల్ ల్యాంప్‍లను ఒకాయా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ రేర్ షాక్ అబ్జార్బర్లను ఈ స్కూటర్ కలిగి ఉంది.
ధర, సేల్
Okaya Faast F2F Electric Scooter: ఒకాయా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.83,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సియాన్, మెటాలిక్ గ్రీన్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్ కలర్ ఆప్షన్‍లలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 550 ఒకాయా ఎలక్ట్రిక్ ఔట్‍లెట్లలో ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు.
కాగా, ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవలే లాంచ్ అయింది. దీని ధర రూ.99,999గా ఉంది. 3.5kWh బ్యాటరీని కలిగి ఉన్న ఈ స్కూటర్.. సింగిల్ ఫుల్ చార్జ్‌పై 125 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లుగా ఉంది.