Okaya Faast F3 vs Ola S1: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలా ఉన్నాయి? ఏ విషయంలో ఏది బెస్ట్!-okaya faast f3 vs ola s1 electric scooters comparison battery range price and more details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Okaya Faast F3 Vs Ola S1: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలా ఉన్నాయి? ఏ విషయంలో ఏది బెస్ట్!

Okaya Faast F3 vs Ola S1: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలా ఉన్నాయి? ఏ విషయంలో ఏది బెస్ట్!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 12, 2023 04:13 PM IST

Okaya Faast F3 vs Ola S1: ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవల లాంచ్ అయింది. ఓలా ఎస్1కు 2kWh బ్యాటరీ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు స్కూటర్లు ఏ విభాగంలో ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

Okaya Faast F3 vs Ola S1
Okaya Faast F3 vs Ola S1

Okaya Faast F3 vs Ola S1: ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‍లో తాజాగా లాంచ్ అయింది. మంచి రేంజ్‍తో ఎంట్రీ లెవెల్‍లో అడుగుపెట్టింది. ఇక ఓలా ఎలక్ట్రిక్ కూడా ఎస్1 లైనప్‍లో కొత్త వేరియంట్లను ఇటీవల తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ఓలా ఎస్1కు 2 కిలోవాట్ హవర్ (kWh) బ్యాటరీ వేరియంట్‍ (Ola S1 2kWh) ను తీసుకొచ్చింది. ఒకాయా ఫాస్ట్ ఎఫ్3, ఓలా ఎస్1 2kWh బ్యాటరీ వేరియంట్ స్కూటర్ ధర దాదాపు ఒకే విధంగా ఉంది. మరి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, డిజైన్ విషయంలో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను పోల్చి చూస్తే ఎలా ఉన్నాయంటే..

Okaya Faast F3 vs Ola S1: ధర

ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.99,999గా ఉంది. ఇప్పటికే ఒకాయా వెబ్‍సైట్‍తో పాటు డీలర్‌షిప్‍ల వద్ద బుకింగ్ మొదలైంది. ఇక ఓలా ఎస్1 స్కూటర్ 2kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. కాగా, ఓలా ఎస్1లో 3kWh బ్యాటరీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

Okaya Faast F3 vs Ola S1: డిజైన్

ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 అప్రాన్‍‍కు ఓ ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్‍ ఉంది. ఇంటిగ్రేడెడ్ డీఆర్ఎల్‍లు ఉన్నాయి. షార్ప్‌గా కనిపించే మిర్రర్స్, ఫ్లాట్ ఫుట్‍బోర్డుతో వస్తోంది. మొత్తంగా ఈ స్కూటర్ కాస్త షార్ప్ లుక్‍ను కలిగి ఉంది. మరోవైపు ఓలా ఎస్1 డిజైన్ సింపుల్‍గా ఉంటుంది. క్లాసీ లుక్‍ను ఇస్తుంది. డ్యుయల్ పోడ్ ఎల్ఈడీ హెడ్‍లైట్, ఇండికేటర్.. ఆప్రాన్‍పై ఉంటుంది. ఫ్లాట్ ఫుట్ బోర్డుతో వస్తోంది.

Okaya Faast F3 vs Ola S1: బ్యాటరీ, రేంజ్

ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్.. డ్యుయల్ బ్యాటరీలతో వస్తోంది. బ్యాటరీ సామర్థ్యం మొత్తంగా 3.5 kWhగా ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల వరకు ఈ స్కూటర్‌పై ప్రయాణించేలా రేంజ్ ఉంటుందని ఒకాయా ఈవీ పేర్కొంది. 5 గంటల్లో బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది.

ఒలా ఎస్1 2kWh బ్యాటరీ స్కూటర్‌పై ఒక్కసారి ఫుల్ చార్జ్ చేసి 91కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కాగా, ఎస్1 మోడల్‍లో 3kWh బ్యాటరీ వేరియంట్ కూడా ఉంది. ఇది 141 రేంజ్ ఇస్తుంది. అయితే దీని ధర రూ.1,09,999గా ఉంది.

Okaya Faast F3 vs Ola S1: టాప్ స్పీడ్

ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్ల (70 kmph)గా ఉంది. ఓలా ఎస్1 2kWh బ్యాటరీ వేరియంట్ స్కూటర్ టాప్ స్పీడ్ 90 kmphగా ఉంది. మోటార్ పవర్ విషయంలో రెండింటితో పోలిస్తే ఓలా ఎస్1 అత్యుత్తమంగా ఉంది.

Okaya Faast F3 vs Ola S1: ఇక రెండు స్కూటర్లు.. ముందు, వెనుక వీల్స్‌కు సీబీఎస్‍తో కూడిన డ్రమ్ బ్రేక్‍లను కలిగి ఉన్నాయి. రెండు స్కూటర్లకు టచ్ స్క్రీన్‍తో కూడిన డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, బ్లూటూత్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం