Ola Electric Scooters: ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‍లో కొత్తగా మూడు వేరియంట్లు.. ధరలు, మార్పులు ఎలా ఉన్నాయంటే..-ola s1 ola s1 air electric scooters gets new variants check price specifications range changes ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Scooters: ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‍లో కొత్తగా మూడు వేరియంట్లు.. ధరలు, మార్పులు ఎలా ఉన్నాయంటే..

Ola Electric Scooters: ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‍లో కొత్తగా మూడు వేరియంట్లు.. ధరలు, మార్పులు ఎలా ఉన్నాయంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 09, 2023 06:08 PM IST

Ola S1, Ola S1 Air Electric Scooters: ఓలా ఎస్1, ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్త వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటి ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే.

Ola: ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‍లో కొత్తగా మూడు వేరియంట్లు
Ola: ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‍లో కొత్తగా మూడు వేరియంట్లు

Ola S1, Ola S1 Air Electric Scooters: ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‍లో కొత్తగా మూడు వేరియంట్లు వచ్చాయి. ఎస్1 (Ola S1) మోడల్‍లో ఒకటి, ఎస్1 ఎయిర్ (Ola S1 Air) మోడల్‍కు రెండు కొత్త వేరియంట్లను ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).. నేడు (ఫిబ్రవరి 9) లాంచ్ చేసింది. ఓలా ఎస్1 మోడల్‍కు 2 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ వేరియంట్‍ను తీసుకొచ్చింది. దీంతో ఈ వేరియంట్ ధర కాస్త తక్కువగా ఉంది. ఇక ఓలా ఎస్1 ఎయిర్‌కు 2 kWh, 4 kWh బ్యాటరీ వేరియంట్లను లాంచ్ చేసింది. ఇప్పటికే ఎస్1 ఎయిర్.. 2.5 kWh బ్యాటరీ స్కూటర్ కోసం బుకింగ్ చేసుకున్న వారికి 3 kWh బ్యాటరీ వేరియంట్‍ను డెలివరీ చేయనుంది. పూర్తి వివరాలివే..

ఓలా ఎస్1 లైనప్ మార్పులివే

Ola S1 New Variant: ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 2 kWh హవర్ వేరియంట్‍ను ఓలా తీసుకొచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ స్కూటర్‌పై 91 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు (90 kmph)గా ఉంది. దీని ధరను రూ.99,000గా నిర్ణయించింది ఓలా. ఇప్పటికే ఓలా ఎస్1లో 3 kWh బ్యాటరీ వేరియంట్ అందుబాటులో ఉంది. ఇది 141 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 95 kmphగా ఉంది. దీని ధర రూ.1,09,999గా ఉంది.

ఓలా ఎస్1 ఎయిర్ కొత్త వేరియంట్లు

Ola S1 Air New Variants: ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ లైనప్‍లోనూ ఇక 2 kWh, 4 kWh బ్యాటరీ వేరియంట్లను ఓలా తీసుకొచ్చింది. 2.5 kWh బ్యాటరీ మోడల్‍ను 3 kWhకి అప్‍గ్రేడ్ చేసింది. ఇప్పటికే దీన్ని బుక్ చేసుకున్న వారికి 3kWh బ్యాటరీతోనే డెలివరీ చేయనుంది. ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లను నేటి నుంచే రిజర్వ్ చేసుకోవచ్చు. జూలైలో డెలివరీలు ప్రారంభిస్తామని ఓలా ప్రకటించింది.

ఓలా ఎస్1 ఎయిర్ 2 kWh బ్యాటరీ వేరియంట్‍ను ఒక్కసారి చార్జ్ చేస్తే 85 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. దీని ధర రూ.84,999గా ఉంది. 3 kWh బ్యాటరీ మోడల్ 125 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రూ.99,999 ధరకు ఇది లభిస్తుంది. ఓలా ఎస్1 ఎయిర్ 4 kWh బ్యాటరీ వేరియంట్ 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ.1,09,999గా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్ల టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు (85 kmph)గా ఉంది.

Ola S1 Pro: ఓలా ఎస్1 ప్రో టాప్ మోడల్‍గా కొనసాగింది. 4kWh బ్యాటరీ ఉండే ఈ స్కూటర్ 181 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 116 kmphగా ఉంటుంది. దీని ధర రూ.1,29,999గా ఉంది.

టచ్ స్క్రీన్ డిస్‍ప్లే, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, బ్లూటూత్, వైఫై, నేవిగేషన్, జీపీఎస్ సహా మరికొన్ని ఫీచర్లు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లన్నింటికీ ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం