తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Joy Mihos Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 15 రోజుల్లో 18వేలకు పైగా బుకింగ్స్: వివరాలివే

Joy Mihos Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 15 రోజుల్లో 18వేలకు పైగా బుకింగ్స్: వివరాలివే

08 February 2023, 12:57 IST

    • Joy e-bike Mihos electric scooter: జాయ్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 15 రోజుల్లోనే 18వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలివే..
Joy Mihos Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ బైక్‍ కోసం 15 రోజుల్లో 18వేలకు పైగా బుకింగ్స్: వివరాలివే
Joy Mihos Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ బైక్‍ కోసం 15 రోజుల్లో 18వేలకు పైగా బుకింగ్స్: వివరాలివే (HT_Auto)

Joy Mihos Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ బైక్‍ కోసం 15 రోజుల్లో 18వేలకు పైగా బుకింగ్స్: వివరాలివే

Joy e-bike Mihos electric scooter: తొలి బుకింగ్స్‌లోనే జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదరగొట్టింది. 15 రోజుల్లోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 18,600 బుకింగ్స్ వచ్చాయి. ఈ విషయాన్ని జాయ్ ఈ-బైక్స్ వెల్లడించింది. వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్, మొబిలిటీ సంస్థ జాయ్ ఈ-బైక్‍లను తయారు చేస్తోంది. గత నెల జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో జాయ్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆ సంస్థ లాంచ్ చేసింది. జనవరి 22వ తేదీన బుకింగ్స్ ఓపెన్ చేసింది. 15 రోజుల్లోనే 18,600 బుకింగ్‍లను ఈ స్కూటర్ సాధించింది. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ధర, బుకింగ్ వివరాలు

Joy e-bike Mihos electric scooter: జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.49 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. రూ.999 చెల్లించి ఈ స్కూటర్‌ను జాయ్ ఈ-బైక్స్ వెబ్‍సైట్‍లో, డీలర్‌షిప్‍ల వద్ద బుక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ స్కూటర్‌ను బుక్ చేసుకున్న వారికి మార్చి నుంచి డెలివరీలు చేస్తామని జాయ్ ఈ-బైక్స్ ప్రకటించింది.

ఫిబ్రవరి 9వ తేదీన Joy e-bike Mihos electric scooter రెండో దశ బుకింగ్స్ మొదలవుతాయి. ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి ఈ స్కూటర్ డెలివరీలు ఏప్రిల్‍లో వస్తాయి. మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లాసీ, సాలిడ్ ఎల్లో గ్లాసీ, పర్ల్ వైట్ కలర్ ఆప్షన్‍లలో ఈ స్కూటర్ లభిస్తోంది.

Joy e-bike Mihos electric scooter: బ్యాటరీ, రేంజ్, ఫీచర్లు

2.5 కిలో వాట్ హవర్ బ్యాటరీతో జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. నాలుగు నుంచి ఐదు గంటల్లో ఈ బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు (kmph) వేగంగా ఉంది. ఈ బైక్ ముందు, వెనుక అలాయ్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్‍లు ఉంటాయి.

బ్లూటూత్, జీపీఎస్, బుల్ట్ ఇన్ స్పీకర్, యాంటీ థెఫ్ట్, టచ్ డిస్‍ప్లే ఫీచర్లతో జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. ఈ స్కూటర్‌ను స్మార్ట్ ఫోన్‍కు కనెక్ట్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం