తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Okaya Faast F3 Electric Scooter: ఒకాయా నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్: లాంచ్ డేట్ ఖరారు, వివరాలివే

Okaya Faast F3 Electric Scooter: ఒకాయా నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్: లాంచ్ డేట్ ఖరారు, వివరాలివే

05 February 2023, 16:10 IST

    • Okaya Faast F3 Electric scooter: ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారైంది. కొన్ని వివరాలు కూడా బయటికి వచ్చాయి.
Okaya Faast F3 Electric Scooter: ఒకాయా నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్ (Photo: Okaya)
Okaya Faast F3 Electric Scooter: ఒకాయా నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్ (Photo: Okaya)

Okaya Faast F3 Electric Scooter: ఒకాయా నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్ (Photo: Okaya)

Okaya Faast F3 Electric scooter: ఒకాయా ఎలక్ట్రిక్ (Okaya Electric) కంపెనీ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి రానుంది. ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ తేదీని ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈనెల 10వ తేదీన ఈ స్కూటర్‌ను భారత మార్కెట్‍లోకి తీసుకొస్తున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్‍సైట్‍లో, కంపెనీ సోషల్ మీడియా అకౌంట్లలో టీజ్ చేసింది. ప్రస్తుతం ఒకాయా నుంచి మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉండగా.. ఈ ఫాస్ట్ ఎఫ్3 మోడల్ నాలుగోది కానుంది.

టాప్ స్పీడ్ ఇలా..

Okaya Faast F3 Electric Scooter: ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కూటర్‌ గురించి ఒకాయా ఇంకా ఎక్కువ సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే లీక్‍ల ద్వారా బయటికి వచ్చాయి. 3.5 కిలో వాట్ హవర్ (kHw) డ్యుయల్ బ్యాటరీ అరేంజ్‍మెంట్‍తో ఈ ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 వస్తుందని తెలుస్తోంది. అలాగే 1200W మోటార్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 120 నుంచి 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుందని తెలుస్తోంది. ఈనెల 10వ తేదీన ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ధరను ఒకాయా ఎలక్ట్రిక్ వెల్లడించనుంది.

ప్రస్తుతం మూడు మోడళ్లు..

Okaya Electric Scooters: ఒకాయా ఎలక్ట్రిక్ నుంచి ప్రస్తుతం మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‍లో ఉన్నాయి. ఫాస్ట్ ఎఫ్4 (Okaya Faast F4), ఫ్రీడమ్, క్లాసిక్ ఐక్యూ లభిస్తున్నాయి. ఫాస్ట్ ఎఫ్4 స్కూటర్ 72V 30Ah LFP బ్యాటరీని కలిగిఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 5 నుంచి ఆరు గంటల్లో ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్‍లు ఉంటాయి. ఫాస్ట్ ఎఫ్4 టాప్ స్పీడ్ గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంగా ఉంది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.14లక్షలుగా ఉంది.

ఒకాయా ఫ్రీడమ్ (Okaya Freedum) ఎలక్ట్రిక్ స్కూటర్ 70 నుంచి 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లుగా ఉంటుంది. దీని ధర రూ.74,899 (ఎక్స్-షోరూమ్). ఇక క్లాసిక్ ఐక్యూ (Okaya ClassicIQ) ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ చార్జ్‌పై 60 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్‍ను ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.74,499గా ఉంది. ఈ రెండు స్కూటర్లు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‍లను కలిగి ఉన్నాయి.

తదుపరి వ్యాసం