తెలుగు న్యూస్  /  బిజినెస్  /  River Indie Electric Scooter: విభిన్నమైన డిజైన్‍తో రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది: ధర, రేంజ్ ఎలా ఉన్నాయంటే..

River Indie Electric Scooter: విభిన్నమైన డిజైన్‍తో రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది: ధర, రేంజ్ ఎలా ఉన్నాయంటే..

22 February 2023, 17:11 IST

google News
    • River Indie Electric Scooter: విభిన్నమైన డిజైన్‍తో రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. మంచి రేంజ్, టాప్ స్పీడ్‍తో వస్తోంది.
River Indie Electric Scooter: విభిన్నమైన డిజైన్‍తో రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ (Photo: River)
River Indie Electric Scooter: విభిన్నమైన డిజైన్‍తో రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ (Photo: River)

River Indie Electric Scooter: విభిన్నమైన డిజైన్‍తో రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ (Photo: River)

River Indie Electric Scooter: డిఫరెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రివర్ ఎలక్ట్రిక్ సంస్థ తీసుకొచ్చింది. రివర్ ఇండీ (River Indie) ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‍లో నేడు (ఫిబ్రవరి 22) లాంచ్ అయింది. బుకింగ్‍లు కూడా మొదలయ్యాయి. లుక్ పరంగా ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. వేరే స్కూటర్లతో పోలిస్తే ఈ ఇండీ స్కూటర్ ముందు భాగం చాలా విభిన్నంగా ఉంది. మంచి రేంజ్‍తో వస్తోంది. పూర్తి వివరాలివే..

రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్

River Indie Electric Scooter: రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ లుక్ చాలా డిఫరెంట్‍గా ఉంది. ముందు భాగంలో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన డ్యుయల్ ఫ్రంట్ ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్స్ ఉన్నాయి. ఫుట్ బోర్డు 20 ఇంచులుగా ఉంది. ఎల్ఈడీ టైల్‍లైట్లతో ఈ స్కూటర్ వస్తోంది. 14 ఇంచుల బ్లాక్ అలాయ్ వీల్స్‌పై ఈ స్కూటర్ రన్ అవుతుంది.

River Indie Electric Scooter: ఆరు ఇంచుల కలర్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ స్క్రీన్‍తో ఈ రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. ముందు వీల్‍కు 240mm డిస్క్ బ్రేక్, వెనుక వీల్‍కు 200mm డిస్క్ బ్రేక్ ఉంటాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు టెలిస్కోపిక్ సెటప్, వెనుక ట్విన్ హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది.

River Indie Electric Scooter: రివర్ ఇండీ స్కూటర్ సీట్ కింద 43-లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. ఈ స్కూటర్‌కు కొన్ని ఆప్షనల్ యాక్ససరీలను కూడా సెట్ చేసుకోవచ్చని రివర్ ఎలక్ట్రిక్ పేర్కొంది. ఇక పార్క్ అసిస్ట్, యూఎస్‍బీ పోర్ట్ లాంటి ఫీచర్లతో ఈ స్కూటర్ వస్తోంది.

బ్యాటరీ, రేంజ్, టాప్ స్పీడ్

River Indie Electric Scooter: 4 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీతో రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ స్కూటర్‌పై 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. 6.7 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 26 Nm టార్క్యూను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లుగా (90 kmph) ఉంది. 0 నుంచి 40kmph వేగానికి 3.9 సెకన్లలోనే ఈ స్కూటర్ యాక్సలరేట్ అవుతుందని రివర్ ఎలక్ట్రిక్ పేర్కొంది. ఈ స్కూటర్‌కు ఐదు సంవత్సరాలు / 50,000 కిలోమీటర్ల వారెంటీ ఇస్తున్నట్టు రివర్ ఎలక్ట్రిక్ వెల్లడించింది.

రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర

River Indie Electric Scooter: రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.25లక్షలు (ఎక్స్-షోరూమ్‍)గా ఉంది. మాన్‍సూన్ బ్లూ, సమ్మర్ రెడ్, స్ప్రింగ్ యెల్లో కలర్లలో లభిస్తోంది. రైడ్‍రివర్ వెబ్‍సైట్‍లో రూ.1,250 చెల్లించి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆగస్టులో ఈ స్కూటర్ డెలివరీలు మొదలవుతాయని ఆ సంస్థ పేర్కొంది.

తదుపరి వ్యాసం