తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy F23 : బడ్జెట్​ ధరలో స్మార్ట్​ఫోన్​ కావాలా? గ్యాలెక్సీ ఎఫ్​23పై భారీ డిస్కౌంట్​..

Samsung Galaxy F23 : బడ్జెట్​ ధరలో స్మార్ట్​ఫోన్​ కావాలా? గ్యాలెక్సీ ఎఫ్​23పై భారీ డిస్కౌంట్​..

Sharath Chitturi HT Telugu

04 February 2023, 6:31 IST

    • Samsung Galaxy F23 price drop : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీపై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ఫ్లిప్​కార్ట్​ ఇస్తున్న ఆఫర్స్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23
శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23

Samsung Galaxy F23 offers : కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే రైట్​ టైమ్​..! శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీ స్మార్ట్​ఫోన్​పై భారీ డిస్కౌంట్​ను ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. ఈ డిస్కౌంట్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీపై భారీ తగ్గింపు..!

గ్యాలెక్సీ ఎఫ్​23లో రెండు వేరియంట్లు ఉంటాయి. అవి.. 4జీబీ ర్యామ్​+ 128జీబీ స్టోరేజ్​, 6జీబీ ర్యామ్​+ 128జీబీ స్టోరేజ్​. మొదటి వేరియంట్​పై ఫ్లిప్​కార్ట్​లో ఎలాంటి ఆఫర్స్​ లేవు. అయితే.. రెండో వేరియంట్​పై ఫ్లాట్​ 30శాతం డిస్కౌంట్​ లభిస్తోంది. ఫలితంగా రూ. 22,999గా ఉన్న ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 15,999కే వస్తోంది. కాపర్​ బ్లష్​ కలర్​ వేరియంట్​పై ఈ ఆఫర్​ ఉంది.

Samsung Galaxy F23 discounts : అంతేకాకుండా.. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డుపై రూ. 1000 డిస్కౌంట్ సైతం​ లభిస్తోంది. ఫ్లిప్​కార్ట్​ యాక్సిస్​ బ్యాంక్​ కార్డ్​పై 5శాతం డిస్కౌంట్​ వస్తోంది. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డుతో ఈ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీ ధర రూ. 14,999కి తగ్గుతుంది.

ఎక్స్​ఛేంజ్​ డీల్​ కూడా..!

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీపై ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 15,200 తగ్గింపు లభిస్తోంది. పాత స్మార్ట్​ఫోన్​ను ఇచ్చి ఈ డిస్కౌంట్​ను పొందొచ్చు. మీరు ఇచ్చే పాత మొబైల్​పైనే ఈ డిస్కౌంట్​ ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

Samsung Galaxy S23 features : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 సిరీస్​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Samsung Galaxy F23 price : అన్ని డిస్కౌంట్​లు కలుపుకుంటే.. శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీపై రూ. 23,200 తగ్గింపు లభిస్తుండటం విశేషం.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీ ఫీచర్స్​..

గ్యాలెక్సీ ఎఫ్​23 5జీలో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 750 ప్రాసెసర్ దీని సొంతం. రేర్​లో 50 ఎంపీ +8ఎంపీ +2ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8ఎంపీ సెల్ఫీ షూటర్‌ ఇందులో భాగం. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్​పై ఇది పనిచేస్తుంది.

Offers on Samsung Galaxy F23 5G : 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యం, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ ఈ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీలో ఉంటాయి.

గతేడాది లాంచ్​ అయిన ఈ స్మార్ట్​ఫోన్​కు మంచి డిమాండ్​ కనిపించింది. 5జీ మోడల్​ కావడంతో బాగా సేల్స్​ జరిగాయి.