Samsung Galaxy S23 Ultra: 200MP కెమెరా సహా ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా వచ్చేసింది
Samsung Galaxy S23 Ultra: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్రీమియమ్ మొబైల్ లాంచ్ అయింది. ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో విడుదలైంది. పూర్తి వివరాలివే..
Samsung Galaxy S23 Ultra: సామ్‍సంగ్ నయా ఫ్లాగ్‍షిప్ సిరీస్ వచ్చేసింది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ (Samsung Galaxy S23 Series) లాంచ్ అయింది. ఈ సిరీస్‍లో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫ్లాగ్‍షిప్ ఫోన్లు అడుగుపెట్టాయి. గెలాక్సీ అన్‍ప్యాక్డ్ ఈవెంట్ (Galaxy Unpacked 2023) ద్వారా ఈ మొబైళ్లను సామ్‍సంగ్ లాంచ్ చేసింది. ఈ సిరీస్‍లో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా టాప్ ఎండ్ మోడల్‍గా అదిరిపోయే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. అన్ని విభాగాల్లో ప్రీమియమ్‍గా ఉంది. 200 మెగాపిక్సెల్ (MP) ప్రైమరీ కెమెరా నుంచి డిస్‍ప్లే వరకు సూపర్‌గా అనిపిస్తోంది. Samsung Galaxy S23 Ultra పూర్తి వివరాలివే.
క్వాడ్ హెచ్‍డీ+ డిస్‍ప్లేతో..
Samsung Galaxy S23 Ultra: 6.8 ఇంచుల క్వాడ్ హెచ్‍డీ+ (QHD+) డైనమిక్ 2X అమోలెడ్ డిస్‍ప్లేను సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా కలిగి ఉంది. 120హెర్ట్జ్ వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్, హెచ్‍డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటాయి. ఆండ్రాయిడ్ (Android 13) బేస్డ్ OneUI 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ ఫ్లాగ్‍షిప్ ఫోన్ వస్తోంది.
200 మెగాపిక్సెల్ కెమెరా
Samsung Galaxy S23 Ultra Specifications: ఈ మొబైల్ వెనుక ప్రీమియమ్ నాలుగు కెమెరాల సెటప్ ఉంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, మరో 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా కూడా వెనుక ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ప్రీమియమ్ మొబైల్‍కు సామ్‍సంగ్ ఇచ్చింది.
స్టైలస్, వాటర్ రెసిస్టెంట్
Samsung Galaxy S23 Ultra: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాతో పాటే ఇన్‍బుల్ట్ గా ఓ స్టైలస్ పెన్ కూడా వస్తుంది. దీన్ని ఉపయోగించుకొని డిస్‍ప్లేపై నోట్స్ రాసుకోవచ్చు, డ్రాయింగ్స్ వేసుకోవచ్చు. ఇక ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ కూడా ఉంటుంది. సామ్‍సంగ్ నాక్స్ సెక్యూరిటీ, నాక్స్ వాల్ట్ కు Samsung Galaxy S23 Ultra సపోర్ట్ చేస్తుంది.
వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్
Samsung Galaxy S23 Ultra: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ల ఫాస్ట్ వైర్లెస్ చార్జింగ్ 2.0 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇతర వైర్లెస్ చార్జింగ్ డివైజ్‍లకు ఈ ఫోన్ నుంచి చార్జ్ కూడా చేసేలా వైర్లెస్ పవర్ షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై6, బ్లూటూత్ 5.3, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు, ఎన్‍ఎఫ్‍సీ, జీపీఎస్ Samsung Galaxy S23 Ultra కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ధర
Samsung Galaxy S23 Ultra Price in India : సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా టాప్ ఎండ్ మోడల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర రూ.1,24,999, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ ధర రూ.1,34,999, 12జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.1,54,999గా ఉంది. సామ్‍సంగ్ వెబ్‍సైట్, ఈ-కామర్స్ సైట్లు, ఆఫ్‍లైన్ మార్కెట్లలో ఈనెల 17వ తేదీన ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది.
సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ మొబైళ్ల పూర్తి ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం