Samsung Galaxy S23 Price in India: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍ల ధరలు ఇవే.. అధికారికంగా ప్రకటించిన సామ్‍సంగ్-samsung galaxy s23 price in india samsung galaxy s23 plus samsung s23 ultra prices revealed officially sale date february 17 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy S23 Price In India: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍ల ధరలు ఇవే.. అధికారికంగా ప్రకటించిన సామ్‍సంగ్

Samsung Galaxy S23 Price in India: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍ల ధరలు ఇవే.. అధికారికంగా ప్రకటించిన సామ్‍సంగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 02, 2023 01:48 PM IST

Samsung Galaxy S23 Series Price in India: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23), గెలాక్సీ ఎస్23+(Samsung Galaxy S23+), గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఫోన్‍ల ధరలు, వివరాలు ఇవే.

Samsung Galaxy S23 Price in India: సామ్‍సంగ్ ఎస్23 సిరీస్ ఫోన్‍ల ధరలు ఇవే (Photo: Samsung)
Samsung Galaxy S23 Price in India: సామ్‍సంగ్ ఎస్23 సిరీస్ ఫోన్‍ల ధరలు ఇవే (Photo: Samsung)

Samsung Galaxy S23 Series Price in India: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍లను ప్రముఖ కంపెనీ సామ్‍సంగ్ తీసుకొచ్చింది. గెలాక్సీ అన్‍ప్యాక్డ్ (Galaxy Unpacked) ఈవెంట్ ద్వారా లాంచ్ చేసింది. భారత్‍లో ధరలను నేడు (ఫిబ్రవరి 2) ప్రకటించింది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23), సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+(Samsung Galaxy S23+), సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) మొబైళ్ల వేరియంట్లు, ధర వివరాలను పూర్తిగా వెల్లడించింది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ సహా అన్ని విభాగాల్లో ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను ఈ మొబైళ్లు కలిగి ఉన్నాయి. అదిరిపోయే ప్రీమియమ్ ఫీచర్లతో వచ్చాయి. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ వివరాలు ఇవే.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ధర

Samsung Galaxy S23 Price in India: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది.

  • 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర: రూ.74,999
  • 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర: రూ.79,999

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ ధర

Samsung Galaxy S23+ Price in India: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ కూడా రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

  • 8జీబీ ర్యామ్ + 256జీజీ స్టోరేజ్ ధర: రూ.94,999
  • 8జీబీ ర్యామ్ + 512జీజీ స్టోరేజ్ ధర: రూ.1,04,999

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ధర

Samsung Galaxy S23 Ultra: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా టాప్ ఎండ్ మోడల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది.

  • 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర: రూ.1,24,999
  • 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ ధర: రూ.1,34,999
  • 12జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్ ధర: రూ.1,54,999

Also Read: 200MP కెమెరా సహా ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా వచ్చేసింది

సేల్ డేట్, కలర్ ఆప్షన్లు

Samsung Galaxy S23 Series Sale Date: ఈనెల 17వ తేదీన సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లు సేల్‍కు వస్తాయి. సామ్‍సంగ్ అధికారిక వెబ్‍సైట్‍, ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‍తో పాటు ఆఫ్‍లైన్ మార్కెట్‍లో అందుబాటులోకి వస్తాయి. ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్లు లభిస్తాయి. సామ్‍సంగ్ వెబ్‍సైట్‍లో రెడ్, గ్రాఫైట్, లైమ్, స్కైబ్లూ అనే కలర్ ఆప్షన్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటికే సామ్‍సంగ్ వెబ్‍సైట్‍లో ఈ మొబైళ్ల ప్రీ-బుకింగ్ మొదలైంది. 3వ తేదీ వరకు ప్రీబుకింగ్ ఉంటుంది.

Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‍లో ఈ మూడు మొబైళ్లు స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తున్నాయి. అల్ట్రా మోడల్‍కు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఎస్23, ఎస్23+ ఫోన్ల వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‍ప్లేలతో ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత కథనం