LIC WhatsApp services launched : ఎల్ఐసీ వాట్సాప్ సేవలు షురూ..
02 December 2022, 13:57 IST
- LIC WhatsApp services : వాట్సాప్ సేవలను శుక్రవారం ప్రారంభించింది ఎల్ఐసీ.. ఆ వివరాలు..
వాట్సాప్ సేవలను లాంచ్ చేసిన ఎల్ఐసీ..
LIC WhatsApp services : తమ పాలసీహోల్డర్ల కోసం వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది ఎల్ఐసీ. ఫలితంగా.. పాలసీదారులు ఇళ్ల నుంచే ప్రశాంతంగా సమాచారాన్ని పొందవచ్చు. ఎలాంటి సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు అనే విషయంపై ఓ లిస్ట్‌ను రూపొందించింది.
వాట్సాప్ సేవల కోసం ఎల్ఐసీ పాలసీదారులు.. 8976862090 నెంబర్‌కు 'HI' అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
ఎల్ఐసీ వాట్సాప్ సేవల లిస్ట్..
- ప్రీమియం కట్టాల్సిన తేదీ వివరాలు
- బోనస్ సమాచారం
- పాలసీ స్టేటస్
- LIC WhatsApp services list : లోన్ ఎలిజిబులిటీ కొటేషన్
- లోన్ రీపేమెంట్ కొటేషన్
- లోన్ ఇంట్రెస్ట్ కట్టాల్సిన తేదీ
- ప్రీమియం కట్టిన తర్వాత ఇచ్చే సర్టిఫికెట్
- యూఎల్ఐపీ- స్టేట్మెంట్ ఆఫ్ యూనిట్స్
- ఎల్ఐసీ సర్వీసెస్ లింక్స్
- ఆప్ట్ ఇన్/ ఔట్ సర్వీసులు
- ఎండ్ కన్వర్జేషన్
ఎల్ఐసీ వాట్సాప్ సేవలను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
LIC WhatsApp services news : "పాలసీలను ఎల్ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న పాలసీదారులు.. వాట్సాప్ సేవలను వినియోగించుకోగలరు. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 8976862090 నెంబర్‌కు 'HI' మెసేజ్‌తో వాట్సాప్ చేయాలి. ఆప్షన్స్ వస్తాయి. అందులో నుంచి కావాల్సిన సర్వీసును పొందవచ్చు," అని ఎల్ఐసీ పేర్కొంది.
ఎల్ఐసీ ఆన్లైన్ సేవల కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
పాలసీ నెంబర్, పాలసీల ఇన్స్టాల్మెంట్ ప్రమియమ్స్, పాస్‌పోర్ట్/ పాన్ కార్డ్ స్కాన్డ్ కాపీ( సైజుు- 100కేబీ లోపల)ని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది.
స్టెప్ 1:- www.licindia.in లోకి వెళ్లి కస్టమర్ పోర్టల్ మీద క్లిక్ చేయాలి.
LIC WhatsApp services details : స్టెప్ 2:- న్యూ యూజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 3:- ఐడీ, పాస్వర్డ్ మీద క్లిక్ చేసి, సబ్మీట్ ప్రెస్ చేయాలి.
స్టెప్ 4:- కొత్త వచ్చిన ఐడీతో లాగిన్ అయ్యి, బేసిక్ సర్వీసెస్ కింద ఉన్న యాడ్ పాలసీ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 5:- మిగిలిన పాలసీలను ఎన్రోల్ చేసుకోవాలి. ఎల్ఐసీ పోర్టల్‌లో ఒక్కసారి రిజిస్టర్ అయితే.. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ వంటి బేసిక్ వివరాలు ఆటోమెటిక్‌గా వచ్చేస్తాయి.