తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lic’s Dhan Varsha Plan: ఎల్ ఐసీ నుంచి వచ్చిన ఈ ప్లాన్ గురించి తెలుసా?

LIC’s Dhan Varsha plan: ఎల్ ఐసీ నుంచి వచ్చిన ఈ ప్లాన్ గురించి తెలుసా?

HT Telugu Desk HT Telugu

10 November 2022, 16:32 IST

  • LIC’s Dhan Varsha plan: భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ ఐసీ(LIC) తాజాగా ధన వర్ష పేరుతో ఒక జీవిత బీమా ప్లాన్ ను ఆవిష్కరించింది. ఇది నాన్ లింక్డ్, నాల్ పార్టిసిపేటింగ్ సేవింగ్స్ సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

LIC’s Dhan Varsha plan: LIC నుంచి వచ్చిన ఈ ధన వర్ష జీవిత బీమా ప్లాన్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు, అంటే 2023, మార్చి 31 వరకు, అందుబాటులో ఉంటుంది.

LIC’s Dhan Varsha plan: భద్రతతో పాటు పొదుపు

ఈ ధన వర్ష(Dhan Varsha) ప్లాన్ తో భద్రతతో పాటు పొదుపు కూడా సాధ్యమవుతుంది. ఈ ప్లాన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇవీ..

  • పాలసీ మెచ్యూరిటీ నాటికి కచ్చితమైన ఇన్సూర్డ్ మొత్తం పాలసీ హెల్డర్ కు అందుతుంది. పాలసీ టర్మ్ గడువులోపు దురదృష్టవశాత్తూ పాలసీ హోల్డర్ మరణిస్తే.. వారి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది.
  • పాలసీ హోల్డర్ ముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. పాలసీ హోల్డర్ మరణం సంభవిస్తే కచ్చితమైన ఇన్సూర్ చేసిన మొత్తం తీసుకోవచ్చు. లేదా, ఇన్సూర్ చేసిన మొత్తంపై ప్రీమియంపై 10 రెట్లు తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ ను 10 లేదా 15 ఏళ్లు పెట్టుకోవచ్చు.
  • 10 ఏళ్ల పాలసీ టర్మ్ తో ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 8 ఏళ్లు కాగా, 15 ఏళ్ల పాలసీ టర్మ్ తో ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 3 ఏళ్లు.
  • తీసుకున్న పాలసీ టర్మ్, సమ్ అస్యూర్డ్ ఆప్షన్ ను బట్టి ఈ పాలసీ తీసుకోవడానికి గరిష్ట వయస్సు 35 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుంది.
  • ఈ పాలసీకి కనీస బేసిక్ సమ్ అస్యూర్డ్ రూ. 1.25 లక్షలు. గరిష్ట పరిమితి లేదు.
  • పాలసీ టర్మ్ పొడవునా.. ప్రతీ పాలసీ సంవత్సరం ముగింపు తరువాత గ్యారంటీ అడిషన్స్ ఉంటాయి.
  • ఈ పాలసీకి రెండు రైడర్లు ఉన్నాయి. ఒకటి యాక్సిడెంటల్ డెత్, డిసెబిలిటీ బెనిఫిట్ రైడర్, మరొకటి, న్యూ టర్మ్ అస్యూరెన్స్ రైడర్.
  • ఈ పాలసీపై కొన్ని షరతులకు లోబడి రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది.