తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Electric Scooter: కొమాకి నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్: మంచి రేంజ్, కొత్త ఫీచర్లతో..

New Electric Scooter: కొమాకి నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్: మంచి రేంజ్, కొత్త ఫీచర్లతో..

15 March 2023, 6:11 IST

    • Komaki LY Pro Electric Scooter: కొమాకి ఎల్‍వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‍లోకి వచ్చింది. డ్యుయల్ బ్యాటరీతో అడుగుపెట్టింది.
New Electric Scooter: కొమాకీ నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్ (Photo: Komaki)
New Electric Scooter: కొమాకీ నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్ (Photo: Komaki)

New Electric Scooter: కొమాకీ నుంచి నయా ఎలక్ట్రిక్ స్కూటర్ (Photo: Komaki)

Komaki LY Pro Electric Scooter: కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్ డివిజన్ కొత్తగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. డ్యుయల్ బ్యాటరీ సెటప్‍తో కొమాకి ఎల్‍వై ప్రో స్కూటర్‌ను భారత మార్కెట్‍లో లాంచ్ చేసింది. రెండు రిమూవల్ బ్యాటరీలను ఈ స్కూటర్ కలిగి ఉంది. బ్లూటూత్, టీఎఫ్‍టీ డిస్‍ప్లే, క్రూజ్ కంట్రోల్ సహా మరిన్ని నయా ఫీచర్లతో ఈ స్కూటర్ వస్తోంది. కొమాకి ఎల్‍వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, బ్యాటరీ, రేంజ్, ఫీచర్లు సహా పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

బ్యాటరీ, రేంజ్

Komaki LY Pro Electric Scooter: రెండు G2V32AH బ్యాటరీలతో కొమాకి ఎల్‍వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. డ్యుయల్ కనెక్టర్లతో ఈ రిమూవల్ బ్యాటరీలను చార్జ్ చేయవచ్చు. రెండు బ్యాటరీలు ఏకకాలంలో 5 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. 3 కిలో వాట్ మోటార్‌ను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉంది.

కొమాకి ఎల్‍వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 62 కిలోమీటర్లు(62 kmph)గా ఉంది. ఎకో, స్పోర్ట్స్, టర్పో రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్‍లో టాప్ స్పీడ్ 58 kmphగా ఉంటుంది.

ఫీచర్లు

Komaki LY Pro Electric Scooter: ఆన్‍బోర్డ్ నేవిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, కాలింగ్ ఆప్షన్స్ లాంటి ఫీచర్లు ఉండే టీఎఫ్‍టీ డిస్‍ప్లే.. కొమాకి ఎల్‍వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఉంది. క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఉంది. ఎల్ఈడీ లైటింగ్, 12 ఇంచుల అలాయ్ వీల్స్, డ్యుయల్ డిస్క్ బ్రేక్‍లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రిమోట్ కీ లాంటి ఫీచర్లతో ఈ స్కూటర్ వస్తోంది. రివర్స్ మోడ్ ఉంటుంది. ఎత్తు ప్రాంతాల్లో స్కూటర్ స్డిక్ కాకుండా ఉండేందుకు యాంటీ స్కిడ్ టెక్నాలజీని ఈ స్కూటర్ కలిగి ఉంది.

Komaki LY Pro Electric Scooter:ధర

కొమాకి ఎల్‍వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యుయల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.1,37,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. చెర్రీ రెడ్, బ్లాక్, గ్రే కరల్ ఆప్షన్‍లలో ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. కొమాకి డీలర్‌షిప్‍ల వద్ద ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.