తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Revolt Rv400 Electric Bike: రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ రీఓపెన్: పూర్తి వివరాలివే

Revolt RV400 Electric Bike: రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ రీఓపెన్: పూర్తి వివరాలివే

20 February 2023, 18:36 IST

    • Revolt RV400 Electric Bike: రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ మళ్లీ ఓపెన్ అయ్యాయి. బుకింగ్‍కు ఈ బైక్ కాసేపే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ పూర్తి వివరాలివే..
Revolt RV400 Electric Bike: రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ రీఓపెన్ (Photo: Revolt Motors)
Revolt RV400 Electric Bike: రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ రీఓపెన్ (Photo: Revolt Motors)

Revolt RV400 Electric Bike: రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ రీఓపెన్ (Photo: Revolt Motors)

Revolt RV400 Electric Bike: రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ మరోసారి బుకింగ్‍‍లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ రీఓపెన్ చేసినట్టు రివోల్ట్ మోటార్స్ నేడు వెల్లడించింది. అయితే ఈ బుకింగ్స్ కొంతసేపే ఉండే అవకాశం ఉంది. గతంలో నిర్వహించిన బుకింగ్‍ దశల్లో ఈ బైక్‍కు విపరీతమైన డిమాండ్ వచ్చిందని రివోల్ట్ పేర్కొంది. రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) వెబ్‍సైట్‍లో ఈ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్‍ను బుక్ చేసుకోవచ్చు. రూ.2,499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

Facebook, Instagram down: ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ డౌన్; నెటిజన్స్ ఫైర్..

డెలివరీలు అప్పటికల్లా..

Revolt RV400 Electric Bike: ఇప్పుడు రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్‍ను బుక్ చేసుకున్న వినియోగదారులకు మార్చి 31వ తేదీలోగా డెలివరీ చేస్తామని రివోల్ట్ మోటార్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో 35 రివోల్ట్ డీలర్‌షిప్‍లు ఉన్నాయి. రూ.2,499 చెల్లించి రివోల్ట్ మోటార్స్ వెబ్‍సైట్‍లో ఈ బైక్‍ను బుక్ చేసుకోవచ్చు. డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా బుకింగ్స్ అవకాశం కాసేపే ఉండే అవకాశం ఉంది.

వోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ వివరాలు

Revolt RV400 Electric Bike: 3.24 కిలోవాట్ హవర్ (kWh) బ్యాటరీని రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ కలిగి ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ఈ బైక్‍పై ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. ఎకో, స్పోర్ట్స్, పవర్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు (85 kmph)గా ఉంది. ఎల్ఈడీ హెడ్‍లైట్‍ను ఈ బైక్ కలిగి ఉంది. టాప్ స్పీడ్ ఉండే స్పోర్ట్స్ రైడింగ్ మోడ్‍లో ఈ బైక్ 80 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

Revolt RV400 Electric Bike: స్వాపబుల్ బ్యాటరీ సదుపాయం ఈ రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్‍కు ఉంది. చార్జింగ్ అయిపోయిన బ్యాటరీని బయటికి తీసి ఫుల్ చార్జ్ బ్యాటరీతో యూజర్లు రిప్లేస్ చేసుకునే సదుపాయం ఉంటుంది. మై రివోల్ట్ కనెక్టివిటీ యాప్ ద్వారా ఈ బైక్‍ను స్మార్ట్ ఫోన్‍కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ టచ్ కన్సోల్, స్పీకర్లను ఈ బైక్ కలిగి ఉంది.

Revolt RV400 Electric Bike: ముందు, వెనుక వీల్‍లకు సీబీఎస్‍తో కూడిన డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. వెనుక అడ్జస్టబుల్ మోనోషార్క్స్, అప్‍సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ తో రివోల్ట్ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది.

రివోల్ట్ ఆర్‌వీ400 ధర

Revolt RV400 Price: రివోల్ట్ ఆర్‌వీ400 ప్రారంభ ధర రూ.1.25 లక్షలు (సబ్సిడీకి ముందు ఎక్స్-షోరూమ్)గా ఉంది.

తదుపరి వ్యాసం