తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Chetak Electric Scooter: మరింత ఎక్కువ రేంజ్‍తో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో అప్‍డేటెడ్ వెర్షన్

Bajaj Chetak Electric Scooter: మరింత ఎక్కువ రేంజ్‍తో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో అప్‍డేటెడ్ వెర్షన్

16 February 2023, 10:54 IST

google News
    • Bajaj Chetak Electric Scooter: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‍డేటెడ్ వెర్షన్ త్వరలో రానుంది. ప్రస్తుత మోడల్‍తో పోలిస్తే ఇది మరింత ఎక్కువ రేంజ్‍ను కలిగి ఉంటుంది.
Bajaj Chetak Electric Scooter: మరింత ఎక్కువ రేంజ్‍తో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో అప్‍డేటెడ్ వెర్షన్
Bajaj Chetak Electric Scooter: మరింత ఎక్కువ రేంజ్‍తో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో అప్‍డేటెడ్ వెర్షన్ (HT Photo)

Bajaj Chetak Electric Scooter: మరింత ఎక్కువ రేంజ్‍తో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో అప్‍డేటెడ్ వెర్షన్

Bajaj Chetak Electric Scooter: ఎంతో పాపులర్ అయిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు అతిత్వరలో అప్‍డేటెడ్ వెర్షన్ రానుంది. కొత్త వెర్షన్ 2023 చేతక్ స్కూటర్ మరింత ఎక్కువ రేంజ్‍ను ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న దాని కంటే సుమారు 20 శాతం ఎక్కువ రేంజ్‍ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా బజాజ్ చేతక్ కొత్త వెర్షన్ రేంజ్ ఉండనుంది. 2.88 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉన్న ప్రస్తుత మోడల్ 90 కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్‍కు సంబంధించిన ఆర్టీవో డాక్యుమెంట్లు కూడా బయటికి వచ్చాయి. పూర్తి వివరాలివే..

బ్యాటరీ అదే.. కానీ..

Bajaj Chetak Electric Scooter: బజాజ్ చేతక్ అప్‍డేటెడ్ వెర్షన్‍ కూడా 2.88 kWh బ్యాటరీనే కలిగి ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్ మార్పుల కారణంగా ప్రస్తుత మోడల్ కంటే అదనంగా 20 శాతం ఎక్కువ రేంజ్ ఇస్తుంది. మొత్తంగా నయా వెర్షన్ 108 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని ఆర్టీవో డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. అయితే మోటార్ ఔట్‍పుట్ మాత్రం ప్రస్తుతం ఉన్న మోడల్‍లాగే ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ స్కూటర్ మోటర్ 4kW పవర్‌ను కలిగి ఉంటుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 70 కిటోమీటర్ల (70 kmph)గా ఉంది.

Bajaj Chetak Electric Scooter: అప్‍డేటెడ్ వెర్షన్ వస్తే బజాజ్ చేతక్.. రేంజ్ విషయంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్‍ను దాటేయనుంది. ప్రస్తుత ఐక్యూబ్ ఎస్ వేరియంట్ సింగిల్ చార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది. ప్రస్తుతం ఆథెర్ ఎక్స్450ఎక్స్ స్కూటర్ 146 కిలోమీటర్లు, ఓలా ఎస్1 ప్రో 170 కిలోమీటర్ల రేంజ్‍ను ఇస్తున్నాయి. వీటితోనూ చేతక్ పోటీ తీవ్రం కానుంది.

Bajaj Chetak Electric Scooter: బిల్డ్-క్వాలిటీ, డిజైన్ విషయానికి వస్తే చేతక్ స్కూటర్ ప్రీమియమ్‍గా కనిపిస్తుంది. ఎల్‍సీడీ టచ్‍స్క్రీన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, సాఫ్ట్ టచ్ స్విఫ్ట్ గేర్, మెటల్ బాడీతో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది.

Bajaj Chetak Electric Scooter: ప్రస్తుతం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.లక్షా 41 వేలుగా ఉంది. ఇది ఎక్స్-రూమ్ ధర. 2022లో సుమారు 30వేల చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూనిట్లు దేశంలో అమ్ముడయ్యాయి. కొత్త వెర్షన్ ధర ఎంత ఉండనుందో చూడాలి.

తదుపరి వ్యాసం