తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Seltos 2023: కియా సెల్టోస్ ధర పెరిగింది.. పూర్తి వివరాలు ఇవే..

Kia Seltos 2023: కియా సెల్టోస్ ధర పెరిగింది.. పూర్తి వివరాలు ఇవే..

HT Telugu Desk HT Telugu

17 March 2023, 17:54 IST

    • Kia Seltos 2023: కియా నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్  మోడల్ సెల్టోస్. ఈ ఎస్యూవీ 2023 మోడల్ ధరను పెంచుతున్నట్లు కియా ప్రకటించింది. ప్రస్తుతం కియా సెల్టోస్ 1.5 లీటర్ నాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ వర్షన్లలో లభిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Kia India)

ప్రతీకాత్మక చిత్రం

Kia Seltos 2023: సెల్టోస్ 2023 మోడల్ కు కియా గణనీయమైన మార్పులు చేసింది. ఇప్పుడు బీఎస్ 6 ఫేజ్2 (BS6 Phase 2), ఆర్డీఈ (RDE emission) ఉద్గార నిబంధనలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దింది. ఈ నిబంధనలు 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి.

Kia Seltos 2023: ధర పెరిగింది..

కియా సెల్టోస్ 2023 (Kia Seltos) మోడల్ ఢిల్లీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది పెట్రోల్ మ్యాన్యువల్ హెచ్ టీఈ బేస్ వేరియంట్ ఢిల్లీ ఎక్స్ షో రూమ్ ధర. టాప్ ఎండ్ లో ఉన్న ఎక్స్ లైన్ () డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ఢిల్లీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 19.65 లక్షలుగా ఉంది. దాదాపు అన్ని వేరియంట్లపై కనీసం సుమారు రూ. 50వేల పెంపు ఉంది. ధరను పెంచడంతో పాటు కొన్ని కొత్త ఫీచర్లను కూడా ఈ మోడల్ లో కియా అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, డీసీటీ యూనిట్ మోడల్ ఉత్పత్తిని కియా నిలిపివేసింది.

Kia Seltos 2023: రెండు ఇంజిన్ ఆప్షన్లు..

ఇప్పుడు కియా సెల్టోస్ (Kia Seltos) 1.5 లీటర్ నాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. 1.5 లీటర్ నాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్ (1.5-litre petrol engine) 6 స్పీడ్ మ్యాన్యువల్ కానీ సీవీటీ గేర్ సిస్టమ్ తో వస్తోంది. అలాగే, 1.5 లీటర్ టర్బో డీజిల్ (1.5-litre turbo diesel) ఇంజిన్ 6 స్పీడ్ ఐఎంటీ గేర్ బాక్స్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మోడల్ లో 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ను తొలగించారు. 1.4 టర్బో పెట్రోల్ ఇంజిన్ ను 1.5 టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రీప్లేస్ చేయనున్నట్లు సమాచారం. ఈ 1.5 టర్బో పెట్రోల్ ఇంజిన్ ను ఇప్పటికే హ్యుండై (Hyundai) కంపెనీ తన లేటెస్ట్ క్రెటా(Creta), వెర్నా (Verna) కార్లలో వాడుతోంది. కియా సెల్టోస్ వెయిటింగ్ టైమ్ సుమారు 3 నెలలుగా ఉంది.

టాపిక్