తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vehecle Loan Tips: వెహికిల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Vehecle loan tips: వెహికిల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

HT Telugu Desk HT Telugu

06 January 2023, 22:25 IST

  •  Vehecle loan tips: ద్విచక్ర వాహనం ఇప్పుడు నిత్యావసరం. విద్య, ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం ఒక టూ వీలర్(two-wheeler) ఇప్పుడు కచ్చితంగా అవసరం. టూ వీలర్ (two-wheeler) కొనుగోలు కోసం లోన్ (two-wheeler loan) తీసుకునే వారు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vehecle loan tips: ద్విచక్ర వాహనాలకు భారత్ అతి పెద్ద మార్కెట్. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (National Family Health Survey 5) ప్రకారం భారత్ 54 కుటుంబాలకు ఒకటి లేదా అంతకుమించిన ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అలాగే, 2021 -22 ఆర్థిక సంవత్సరంలో 13.47 కోట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. వాటిలో సుమారు 60% మోటారు సైకిళ్లే.

Vehecle loan tips: లోన్ కు వెళ్తున్నారా?

టూ వీలర్ కొనాలన్న ఆలోచన వచ్చిన వారు ముందుగా చూసేది లోన్ లభించే అవకాశం గురించి. తన ఆదాయం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, ఎంత మేరకు లోన్ వస్తుంది? ఏ స్థాయిలో నెలవారీ చెల్లింపులు ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందనేది పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో టూ వీలర్ లోన్ తీసుకోవాలనుకునే వారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.

  • ఇప్పుడు దాదాపు అన్ని వెహికిల్ షో రూమ్ ల్లో రుణ సంస్థల ప్రతినిధులు కూడా అందుబాటులో ఉంటున్నారు. లోన్ కు అవసరమన డాక్యుమెంట్లు, ఇతర వివరాలను వారు చెప్తారు.
  • ముందుగా వాహన ఆన్ రోడ్ ధర తెలుసుకోవాలి. ఆ వాహనానికి లభించే లోన్ ఆఫర్ల గురించి ఎంక్వైరీ చేయాలి. కొన్ని రకాల వాహన మోడల్స్ కు కొన్ని బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీకి రుణాలు ఇస్తుంటాయి. వాహన తయారీ సంస్థ, బ్యాంక్ కు మధ్య ఒప్పందం మేరకు అలాంటి ఆఫర్లు వస్తుంటాయి. అలాంటి ఆఫర్ల గురించి ఆరా తీయాలి.
  • ఈయర్ ఎండింగ్, దసరా దీపావళి వంటి పండుగల సందర్భాల్లో వాహనాల సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ సమయాల్లో మంచి డిస్కౌంట్ , క్యాష్ బ్యాక్ , సర్వీస్ ఫ్రీ, నో ప్రాసెసింగ్ ఫీ .. వంటి ఆఫర్లు వస్తుంటాయి. సమీప భవిష్యత్తులో అవి వచ్చేలా ఉంటే, టూ వీలర్ కొనుగోలును వాయిదా వేసుకోవడం బెటర్.
  • ఆదాయం, ఆ ఆదాయానికి గానూ లభించే రుణ మొత్తం, రీపేమెంట్ టెన్యూర్(), ఈఎంఐ() మొదలైన వాటిపై అవగాహన తెచ్చుకోవాలి. నెలవారీ చెల్లింపులకు ఇబ్బంది లేని కాల పరిమితిని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా కాల పరిమితి పెరుగుతున్న కొద్దీ నెలవారీ చెల్లించే మొత్తం తగ్గుతుంటుంది. అందువల్ల, కాల పరిమితి మరీ ఎక్కవ లేకుండా, అలాగే, నెలవారీ చెల్లింపుల్లో ఇబ్బంది కలగకుండా టెన్యూర్ ను, లోన్ అమౌంట్ ను నిర్ణయించుకోవాలి.
  • రుణం తీసుకుంటున్న సంస్థ గురించి కూడా తెలుసుకోవాలి. కొన్ని ప్రవైేటు సంస్థలు ఈఎంఐల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అవసరమైతే, ఆన్ లైన్ లో ఆయా సంస్థల రివ్యూస్ ను చదవాలి.
  • రుణం తీసుకునే ముందే, ప్రాసెసింగ్ ఫీ లాంటి చార్జీల వివరాలను అడిగి తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు హిడెన్ చార్జీలుగా పెద్ద మొత్తాలే వసూలు చేస్తుంటాయి. అందువల్ల అన్ని చార్జీల గురించి ముందే కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలి.
  • మంచి క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయాలి. క్రెడిట్ స్కోర్ బాగా ఉంటే, ఎక్కువ మొత్తంలో లోన్ రావడమే కాకుండా, వడ్డీ శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

టాపిక్