How to payoff car loan : మీ కారు లోన్​ను 'స్మార్ట్'​గా క్లియర్​ చేసేయండి ఇలా..!-how to payoff car loans smartly here are the 5 smart steps to follow ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Payoff Car Loan : మీ కారు లోన్​ను 'స్మార్ట్'​గా క్లియర్​ చేసేయండి ఇలా..!

How to payoff car loan : మీ కారు లోన్​ను 'స్మార్ట్'​గా క్లియర్​ చేసేయండి ఇలా..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 18, 2022 08:55 AM IST

How to payoff car loans smartly : మీపై కారు లోన్​ భారం ఉందా? లేదా మీరు కారు లోన్​ తీసుకుందామని చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..

మీ కారు లోన్​ను 'స్మార్ట్'​గాా క్లియర్​ చేసేయండి ఇలా..!
మీ కారు లోన్​ను 'స్మార్ట్'​గాా క్లియర్​ చేసేయండి ఇలా..!

How to payoff car loans smartly : మీరు కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా? ఇందుకోసం లోన్​ తీసుకుంటున్నారా? లేదా.. ఇప్పటికే మీరు కారుకు లోన్​ తీసుకుని కడుతున్నారా? అయితే కారు లోన్​ను స్మార్ట్​గా చెల్లించే టిప్స్​ మీకోసమే..

బడ్జెట్​ చూసుకోండి..

అసలు కారు కొనేముందే.. మన ఫైనాన్షియల్స్​కి తగ్గట్టు ఓ బడ్జెట్​ను వేసుకోవాలి. ఆ బడ్జెట్​ పరిధిలోని వాహనాలను మాత్రమే చూసుకోవాలి. ఉదాహరణకు.. మీ ఫైనాన్షియల్స్​ పరంగా మీరు చిన్న హ్యాచ్​బ్యాక్​ కారునే తీసుకోగలరు అనుకుందాము. ఆ సమయంలో మీరు ప్రీమియం ఎస్​యూవీవైపు వెళ్లకూడదు. అది మీ లిమిట్​ దాటిపోతుందని అర్థం చేసుకోవాలి. 

ఈ కాలంలో లోన్​లు సులంభంగానే దొరికేస్తున్నాయి. మీకు ప్రీమియం ఎస్​యూవీ కారు కూడా లభించవచ్చు. కానీ వాటికి ఈఎంఐలు కడుతున్నప్పుడు చాలా కష్టమైపోతుందని గుర్తుపెట్టుకోవాలి.

అదనపు ఈఎంఐలు చెల్లించండి..

How to clear car loan faster : లోన్​ తీసుకుంటున్నప్పుడు.. టెన్యూర్​, నెలకు ఎంత ఈఎంఐ చెల్లించాలి వంటివి నిర్ణయించుకోవచ్చు. అయితే.. నెలకు ఇంతే కడతాను అని అనుకోకుండా.. వీలు కుదిరినప్పుడల్లా.. అదనపు డబ్బులు చెల్లిస్తూ ఉండటం మంచిది. ఈ విధంగా లోన్​పై వడ్డీ భారం తగ్గుతుంది. లోన్​ టెన్యూర్​ కూడా దిగొస్తుంది.

ఉదాహరణకు మీ ఈఎంఐ నెలకు రూ. 14,500 అనుకుందాము. కొంత కాలం తర్వాత దానిని రూ. 15,000- రూ. 16000 చేసేందుకు ప్రయత్నించండి. మీ జేబులో నుంచి అదనపు ఖర్చు అవుతోందని మీరు భావించినా, కట్టాల్సిన దాని కన్నా.. ఎక్కువ ఈఎంఐ చెల్లించడంతో వడ్డీ తగ్గుతుందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి.

డౌన్​పేమెంట్​ కాస్త ఎక్కువ చేస్తే మంచిది..!

How to clear car loan early : కారు లోన్​లో డౌన్​పేమెంట్​దే కీలక పాత్ర! ఇది ఎంత ఎక్కువగా ఉంటే.. కారు లోన్​ అంత తక్కువగా ఉంటుంది. వడ్డీ భారం తక్కువగా ఉంటుంది. టెన్యూర్​ కూడా తక్కువగా పెట్టుకోవచ్చు.

ఉదాహరణకు.. మీరు రూ. 10లక్షల కారు కొనాలని చూస్తున్నారు. మీ వద్ద రూ. 5లక్షలు రెడీగా ఉందని అనుకుందాము. లోన్​ వస్తోంది కదా అని డౌన్​పేమెంట్​ను తగ్గించడం శ్రేయస్కరం కాదు. రూ. 5లక్షలు డౌన్​పేమెంట్​ చేసి, మరో రూ. 5లక్షలు లోన్​ తీసుకోవడం ఉత్తమం. ఒకేసారి రూ. 5లక్షలు చెల్లించడం కష్టమే అయినా.. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా.. తక్కువ లోన్​ తీసుకోవడమే మంచిది!

లోన్​ ప్రీపేమెంట్​..

లోన్​ ప్రీపేమెంట్​ చేసే ఆర్థిక శక్తి మీకు లభిస్తే చాలా మంచింది. లోన్​లో కొంత భాగాన్ని ప్రీపేమెంట్​ చేసేయండి. ఈ విధంగా వడ్డీ భారాన్ని భారీగా తగ్గించుకున్నట్టు అవుతుంది. అయితే.. ప్రీపేమెంట్​కు కొన్ని బ్యాంక్​లు, ఎన్​బీఎఫ్​సీలు పెనాల్టీలు విధిస్తూ ఉంటాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. పెనాల్టీ తక్కువగానే ఉంటే.. ప్రీపేమెంట్​ చేసేయడం ఉత్తమం.

అనవసరమైన ఖర్చులు వద్దు..

Tips to clear smart loan faster : డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరంగా ఖర్చు చేయడం మంచిది కాదు. పైగా.. లోన్​ నడుస్తోంది కాబట్టి.. ఆ టెన్షన్​ ఉంటూనే ఉంటుంది. అందుకే పొదుపు చేయడం ఉత్తమం. ఎక్కువ ఖర్చు చేసేస్తే.. ఆ తర్వాత ఈఎంఐల కోసం డబ్బులు వెతుక్కోవాల్సి వస్తుంది. ఫలితంగా మనపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం