Most Expensive Car: దేశంలోనే అత్యంత ఖరీదైన కారు.. 12 కోట్లతో కొనేసిన హైదరాబాదీ
India's Most Expensive Supercar: హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెక్‌లారెన్ 765 ఎల్‌టీ స్పైడర్ మోడల్ కారును కొనేందుకు సుమారు 12 కోట్లు ఖర్చు చేశాడు. దేశంలోనే అత్యంత ఖరీదైన కారుగా గుర్తింపు దక్కింది.
Hyderabad Man Buys India's Most Expensive Car: హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త రికార్డు సృష్టించాడు. ఏకంగా దేశంలోనే అత్యంత ఖరీదైన కారును కొన్నాడు. ఇందుకోసం రూ. 12 కోట్లను ఖర్చు చేశాడు. మన దేశంలో మెక్‌లారెన్ 765 ఎల్‌టీ స్పైడర్ మోడల్ కారును కొన్న తొలి వ్యకి కూడా ఇయనే..! ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా... తెగ వైరల్ అవుతున్నాయి.
నసీర్ ఖాన్... హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్. ఇతను దేశంలో అత్యంత ఖరీదైన కారు(మెక్‌లారెన్ 765 ఎల్‌టీ స్పైడర్ మోడల్)ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం అతను రూ. 12 కోట్ల ఖర్చు పెట్టాడు. రెండు రోజుల క్రితం కొత్తకారు ముంబయి నుంచి హైదరాబాద్లోని నసీర్ఖాన్ ఇంటికి వచ్చింది. దేశంలో అత్యంత ఖరీదైన కార్లలో ఈ మోడల్ ఒకటిగా దీనికి పేరుంది. నసీర్ ఖాన్.. కారు డెలివరీ అయిన తరువాత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశాడు. కొద్ది టైమ్ లోనే అవి వైరల్ అయ్యాయి. వీటిని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఈ కారు కొనేందుకు ఇన్ఫినిటీ మోటార్స్, లలిత్ చౌదరి వల్లే తనకు సాధ్యమైందని ధన్యవాదాలు చెప్పాడు నసీర్ ఖాన్.
దేశంలోనే మెక్ లారెన్ 765 ఎల్టీ స్పైడర్ కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా నగరానికి చెందిన నసీన్ ఖాన్ నిలిచారు. ఇండియాలో మార్కెట్ లో అత్యంత ఖరీదైన టాప్ ఎండ్ కార్లలో మెక్ లారెన్ ఒకటని కార్టోక్ డాట్ కామ్(Cartoq.com.) రిపోర్ట్ చేసింది. కార్ లవర్ అయిన నసీర్ ఖాన్ వద్ద ఇప్పటికే టాప్ ఎండ్ కార్లు చాలా ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ కార్, మెర్సిడీజ్- బెంజ్ జీ350డీ, ఫోర్డ్ ముస్టంగ్, లంబోర్గిని అవెంటడార్, లంబోర్గిని ఉరుస్ లాంటి కోట్ల విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆయన ఇన్ స్టాలో ఆ ఫొటోలను చూడొచ్చు.
కారు ప్రత్యేకతలివే..
ఏరో డైనమిక్ డిజైన్‌తో ఈ కారు(McLaren 765 LT Spider)ను రూపొందించారు. ఈ సూపర్ కారు టాప్ ఓపెన్ అయ్యేందుకు 11 సెకన్ల సమయం పడుతుంది. ఈ కారుకు 4.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ కారు ఇంజిన్ 765 పీఎస్, 800 ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. కేవలం 2.7 సెకన్లలో గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 7.2 సెకన్లకు గంటకు 124 కి.మీ వేగం అందుకునే మెక్ లారెన్ 765 ఎల్టీ స్పైడర్ కార్లు గరిష్టంగా గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని Cartoq.com పేర్కొంది.