New sedan cars : 2023లో లాంచ్​కానున్న టాప్​ సెడాన్​, హ్యాచ్​బ్యాక్​ కార్స్​ ఇవే!-check out the lsit of new sedans and hatchbacks coming to india in 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Check Out The Lsit Of New Sedans And Hatchbacks Coming To India In 2023

New sedan cars : 2023లో లాంచ్​కానున్న టాప్​ సెడాన్​, హ్యాచ్​బ్యాక్​ కార్స్​ ఇవే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 17, 2022 07:33 AM IST

New sedan cars in India 2023 : కొత్త సెడాన్​లు, హ్యాచ్​బ్యాక్​ కార్లు 2023లో ఇండియా రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాము.

బీఎండబ్ల్యూ
బీఎండబ్ల్యూ (REUTERS)

New sedan cars in India 2023 : 2023 కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. కొత్త కొత్త లాంచ్​లతో నూతన ఏడాదిలో తమ జోరును కొనసాగించాలని అనేక ఆటో సంస్థలు భావిస్తున్నాయి. పక్క ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. 2023లో లాంచ్​ కానున్న కొన్ని సెడాన్​, హ్యాచ్​బ్యాక్​ మోడల్స్​పై ఓ లుక్కేద్దాం..

బీఎండబ్ల్యూ 7 సిరీస్​..

BMW 7 series sedan launch in India : బీఎండబ్ల్యూ న్యూ జెన్​ ఫ్లాగ్​షిప్​ సెడాన్ 7 సిరీస్​ వచ్చే ఏడాది లాంచ్​ కానుంది. దీని ఎక్స్​టీరియర్​ చాలా బోల్డ్​గా కనిపిస్తోంది. ఈ సిరీస్​లో కొత్తగా.. డబుల్​ బ్యారెల్​ హెడ్​ల్యాంప్స్​ను తొలగించి, స్ప్లిట్​ హెడ్​ల్యాంప్​ను జోడించింది బీఎండబ్ల్యూ. ఇంటీరియర్​ మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. డాష్​బోర్డ్​లో ఫుల్​-విడ్త్​ లైట్​ బ్యాండ్​ 14.9 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ టచ్​స్క్రీన్​, 12.3 ఇంచ్​ ఇన్​స్ట్రుమెంట్​ డిస్​ప్లే వంటి ఫీచర్స్​ ఉన్నాయి. బ్యాక్​ సీట్​ ప్యాసెంజర్లకు సైతం 31.3 ఇంచ్​, 8కే సినిమా స్క్రీన్​ ఆప్షన్​ లభిస్తుండటం విశేషం. రూఫ్​కి ఇది అటాచ్​ చేసి, ఫోల్డ్​ చేసుకునే విధంగా ఇది ఉండొచ్చు. అంతేకాకుండా.. ఇంకో 5.5 ఇంచ్​ టచ్​స్క్రీన్​ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇండియాలో.. బీఎండబ్ల్యూ 7 సిరీస్​ 299హెచ్​పీ, 2.0లీటర్​ డీజిల్(730డీ)​, 380 హెచ్​పీ, 3.0 లీటర్​ పెట్రోల్(740ఐ)​, 543హెచ్​పీ, 4.4 లీటర్​ వీ8 పెట్రోల్​(ఎం760ఐ) వేరియంట్స వస్తాయి. వీటిల్లో 488వీ మైల్డ్​ హైబ్రీడ్​ టెక్​ ఉండనుంది. అంతేకాకుండా.. పూర్తి ఎలక్ట్రిక్​ వేరియంట్​.. బీఎండబ్ల్యూ ఐ7 కూడా వీటితో పాటు లాంచ్​ అవుతుంది.

  • లాంచ్​(అంచనా):- 2023 తొలినాళ్లల్లో
  • ధర(అంచనా):- రూ. 55లక్షలు- రూ. 1.5కోట్లు

హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ హ్యాచ్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​..

Hyundai Grand I10 Nios hatchback : హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​కు త్వరలోనే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోందని మార్కెట్​లో ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడునట్టుగానే.. ఇందులోనూ 1.2లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండొచ్చు. ఇది 83హెచ్​పీ, 114ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.0లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ కూడా ఉండొచ్చు. ఇది 100హెచ్​పీ పవర్​, 172ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ ఆప్షన్​ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే నిజమైతే.. ఈ 1.2లీటర్​ ఇంజిన్​ 69హెచ్​పీ పవర్​, 95.2ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

  • లాంచ్​ (అంచనా):- 2023 మధ్యలో
  • ధర (అంచనా):- రూ. 6లక్షలు- 9లక్షలు

హ్యుందాయ్​ ఔరా సెడాన్​ ఫేస్​లిఫ్ట్​

Hyundai Aura Sedan 2023 launch : ప్రస్తుతం ఉన్న కాంపాక్ట్​ సెడాన్​ ఔరాకు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ తీసుకురావాలని హ్యుందాయ్​ భావిస్తున్నట్టు సమాచారం. ఇందులోనూ పెట్రోల్​, టర్బో పెట్రోల్​, సీఎన్​జీ ఆప్షన్స్​ ఉండొచ్చు.

  • లాంచ్​ (అంచనా):- 2023 రెండో భాగంలో
  • ధర (అంచనా):- రూ. 6.5లక్షలు- 9.5లక్షలు

న్యూ హ్యుందాయ్​ వెర్నా..

New Hyundai Verna : నెక్స్ట్​ జనరేషన్​ హ్యుందాయ్​ వెర్నా కూడా త్వరలో రోడ్ల మీద చక్కర్లు కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందులో డీజిల్​ ఇంజిన్​ ఉండకపోవచ్చు. పెట్రోల్​తో పాటు మైల్డ్​ హైబ్రీడ్​ టెక్నాలజీ ఉండొచ్చు. పాత వెర్నాతో పోల్చుకుంటే.. కొత్త దానిలో డైమెన్షన్స్​ ఇంకాస్త పెద్దగా ఉండొచ్చు.

మెర్సిడెస్​ బెంజ్​ ఏ క్లాస్​ ఫేస్​లిఫ్ట్​..

Mercedes Benz A class facelift : మెర్సిడెస్​ బెంజ్​ ఏ క్లాస్​లో ఇటీవలే కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ఎల్​ఈడీ లైట్లు, డేటైమ్​ రన్నింగ్​ లైట్స్​ మారాయి. రేర్​లో పెద్దగా మార్పులు లేవు. ఇప్పుడు దీనికి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఇండియాలో ప్రస్తుతం ఉన్న 2.0లీటర్​ డీజిల్​ ఇంజిన్​, 1.3లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​లలోనే ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ కూడా ఉండొచ్చు.

  • లాంచ్​ (అంచనా):- 2023 మధ్యలో
  • ధర (అంచనా):- రూ. 45లక్షలు- 50లక్షలు

WhatsApp channel

సంబంధిత కథనం