Hyundai Ioniq 5 launch : ఇండియాలోకి ఐయానిక్​ 5 ఈవీ.. లాంచ్​ డేట్​ ఇదే-hyundai ioniq 5 will make its official india debut on december 20 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Ioniq 5 Launch : ఇండియాలోకి ఐయానిక్​ 5 ఈవీ.. లాంచ్​ డేట్​ ఇదే

Hyundai Ioniq 5 launch : ఇండియాలోకి ఐయానిక్​ 5 ఈవీ.. లాంచ్​ డేట్​ ఇదే

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 16, 2022 07:39 AM IST

Hyundai Ioniq 5 launch in India : హ్యుందాయ్​ ఐయానిక్​5 ఈవీ ఇండియాలో లాంచ్​ కానుంది. లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. ఆ వివరాలు..

హ్యుంగాయ్​ ఐయానిక్​ 5 ఈవీ లాంచ్​ డేట్​ ఇదే..
హ్యుంగాయ్​ ఐయానిక్​ 5 ఈవీ లాంచ్​ డేట్​ ఇదే.. ( HT Auto)

Hyundai Ioniq 5 launch in India : ఇండియాలో ఇప్పుడు ఎలక్ట్రిక్​ వాహనాల హవా నడుస్తోంది. మార్కెట్​లోకి ఈవీలను లాంచ్​ చేసేందుకు ఆటో సంస్థలు ఎగబడుతున్నాయి. ఈ రేస్​లో పైచేయి సాధించేందుకు సరికొత్త ఈవీతో ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టాలని హ్యుందాయ్​ మోటార్స్​ ఫిక్స్​ అయ్యింది! ఈ క్రమంలోనే ఐయానిక్​ 5 ఈవీని ఈ నెల 20న లాంచ్​ చేయనుంది. కోనా ఎలక్ట్రిక్​ తర్వాత.. హ్యుందాయ్​ మోటార్స్​ నుంచి వస్తున్న రెండో ఈవీగా ఈ ఐయానిక్​ 5 నిలువనుంది.

సూపర్​ రేంజ్​.. సూపర్​ ఫీచర్స్​తో.. !

అయితే.. ఈ హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీకి.. కియా ఈవీ6తో పోలికలు ఉన్నాయి. ఈ రెండింటినీ కూడా ఈ-జీఎంపీ ప్లాట్​ఫామ్​పై నిర్మించారు. ఫలితంగా 'రేంజ్​'పై ఎక్కువ దృష్టిపెట్టినట్టు స్పష్టమవుతోంది.

Hyundai Ioniq 5 : ఐయానిక్​ 5లో 58కేడబ్ల్యూహెచ్​, 72.6కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉండొచ్చు. ఇదే జరిగితే.. ఐయానిక్​ 5ను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 384 లేదా 481కి.మీల దూరం ప్రయాణించవచ్చు.

అంతర్జాతీయంగా.. హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీలో రేర్​ వీల్​ డ్రైవ్​, ఆల్​ వీల్​ డ్రైవ్​ కాన్ఫిగరేషన్స్​ ఉంటాయి. బేస్​ వేరియంట్​లోని ఎలక్ట్రిక్​ మోటార్​ 170పీఎస్​పవర్​ను జనరేట్​ చేయగలదు. ఇక టాప్​ వేరియంట్​లోని డ్యూయెల్​ మోటార్​ సెటప్​.. 325పీఎస్​ పవర్​ను జనరేట్​ చేస్తుంది.

Hyundai Ioniq 5 : ఇక హ్యుందాయ్​ ఐయానిక్​ 5ని ఇకో- ఫ్రెండ్లీ మెటీరియల్స్​తో రూపొందించారు. ఇకో- ప్రాసెస్డ్​ లెథర్​, రీసైకిల్డ్​ ప్లాస్టిక్​ నుంచి తయారు చేసిన ఫాబ్రిక్​ను వినియోగించారు. ఇక ఫీచర్స్​ విషయానికొస్తే.. ఐయానిక్​ 5 ఈవీలో 12.3ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, పానారోమిక్​ సన్​రూఫ్​, 360 డిగ్రీ కెమెరా ఉంటాయి. ఇందులో వీ2ఎల్​(వెహికిల్​ టు లోడ్​) ఫీచర్​ కూడా ఉంటుంది.

ఈ హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీలో ఏడీఏఎస్​ సేఫ్టీ ఫీచర్స్​ ఉంటాయి. ఆటోమేటెడ్​ ఎమర్జెన్సీ బ్రేకింగ్​, అడాప్టివ్​ క్రూయిజ్​ కంట్రోల్​, బ్లైండ్​ స్పాట్​ మానిటరింగ్​ వంటి ఫీచర్స్​ సైతం ఇందులో ఉన్నాయి.

Hyundai Ioniq 5 launch date in India : సరికొత్త హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. అయితే.. ఈ ఈవీ.. ప్రారంభ ధర రూ. 50లక్షలు(ఎక్స్​షోరూం)గా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.

ఈ హ్యుందాయ్​ ఐయానిక్​ 5.. కియా ఈవీ6, వోల్వో ఎక్స్​సీ40 రీఛార్జ్​ వంటి వెహికిల్స్​కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ఈవీ పూర్తి వివరాల కోసం లాంచ్​ డేట్​ వరకు ఎదురుచూడల్సిందే!

WhatsApp channel

సంబంధిత కథనం