Hyundai Ioniq 5 launch : హ్యుందాయ్​ నుంచి రెండో ఈవీ.. ఐయానిక్​ 5 లాంచ్​ ఫిక్స్​!-hyundai confirms launch of ioniq 5 in india check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Hyundai Confirms Launch Of Ioniq 5 In India, Check Full Details

Hyundai Ioniq 5 launch : హ్యుందాయ్​ నుంచి రెండో ఈవీ.. ఐయానిక్​ 5 లాంచ్​ ఫిక్స్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 11, 2022 10:58 AM IST

Hyundai Ioniq 5 launch in India : దేశంలో తమ సంస్థ నుంచి రెండో ఈవీగా ఐయానిక్​ 5ని లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది హ్యుందాయ్​ మోటార్​. ఆ వివరాలు..

హ్యుందాయ్​ నుంచి రెండో ఈవీ.. ఐయానిక్​ 5 లాంచ్​ ఫిక్స్​!
హ్యుందాయ్​ నుంచి రెండో ఈవీ.. ఐయానిక్​ 5 లాంచ్​ ఫిక్స్​! (HT Auto)

Hyundai Ioniq 5 launch in India : దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాల రంగం ఊపందుకుంది. ఈవీలను లాంచ్​ చేసేందుకు దేశంలోని అన్ని ఆటో సంస్థలు పోటీపడుతున్నాయి. హ్యుందాయ్​ మోటార్​ కూడా ఇందుకోసం సన్నద్ధమైంది. ఇప్పటికే ఒక ఎలక్ట్రిక్​ వాహనాన్ని లాంచ్​ చేసిన హ్యూందాయ్​.. ఇప్పుడు మరో ఈవీని భారత రోడ్డు మీదకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. గ్లోబల్​ ఫ్లాగ్​షిప్​ ఎలక్ట్రిక్​ క్రాసోవర్​ ఐయానిక్​ 5ని ఇండియా మార్కెట్​లోకి విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

రెండో ఈవీ..

ఇండియాలో.. కోనా ఎలక్ట్రిక్​ పేరుతో సంస్థ నుంచి తొలి ఈవీని లాంచ్​ చేసింది హ్యుందాయ్​ మోటార్​. ఇక రెండో ఈవీగా ఐయానిక్​ 5ని దింపేందుకు ప్రణాళికలు రచించింది. ఈ హ్యుందాయ్​ ఐయనిక్​ 5 ఈవీని ఈ-జీఎంపీ(ఎలక్ట్రిక్​ గ్లోబల్​ మాడ్యులర్​ ప్లాట్​ఫామ్​) ప్లాట్​ఫామ్​పై రూపొందించనుంది. ఈ వాహనం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులో ఉండగా.. కియా సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్​ కారు ఈవీ6కి గట్టి పోటీనిస్తోంది.

Hyundai Ioniq 5 launch date : అయితే.. ఇండియాలో హ్యుందాయ్​ ఐయానిక్​ 5 లాంచ్​ ఎప్పుడుంటుంది? అనే విషయంపై సంస్థ స్పష్టతనివ్వలేదు. కాగా.. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలో ఆటో ఎక్స్​పో జరగనుంది. ఇందులో ఈ హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ.. ప్రదర్శనకు ఉండనుంది. ఈ నేపథ్యంలో.. ఇండియాలో ఈ కారు త్వరలో లాంచ్​ అవుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

"ఇండియాలో మా ఈవీ ప్రయాణం 2019లో మొదలైంది. హ్యుందాయ్​ కోనా ఎలక్ట్రిక్​ వాహనాన్ని లాంచ్​ చేశాము. మొబిలిటీ, ఇన్నోవేటివ్​ వంటి అంశాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. ఇక ఈ-జీఎంపీతో అది సాధ్యపడుతోంది. హ్యుందాయ్​ ఐయానిక్​ 5ని ఇండియాలో లాంచ్​ చేస్తున్నాము," అని హ్యుందాయ్​ మోటార్​ ఇండియా సీఈఓ, ఎండీ ఉన్​సో కిమ్​ తెలిపారు.

Hyundai Staria వాహనానికి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

2028 నాటికి ఇండియాలో 6 ఎలక్ట్రిక్​ వాహనాలను లాంచ్​ చేస్తామని హ్యుందాయ్​ మోటార్​ ఇప్పటికే ప్రకటించింది. రానున్న మోడల్స్​లో ఐయానిక్​ 5 ఎలక్ట్రిక్​ కారు కూడా ఉంటుందని తమ అధికారిక వెబ్​సైట్​లో ఇటీవలే పొందుపరిచింది హ్యుందాయ్​.

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఫీచర్స్​..

Hyundai Ioniq 5 price in India : హ్యుందాయ్​ ఐయానిక్​ 5కి ఫ్యూచరిస్టిక్​ ఎక్స్​టీరియర్​ ప్రొఫైల్​ ఉంటుంది. స్క్వేర్​ డీఆర్​ఎల్​తో కూడిన ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, 20 ఇంచ్​ ఎయిరోడైనమికల్లీ డిజైన్డ్​ అలాయ్​ వీల్స్​, ఫ్లష్​ ఫిట్టింగ్​ డోర్​ హ్యాండిల్స్​, పిక్సలేటెడ్​ ఎల్​ఈడీ టెయిల్​ లైట్స్​, ఇంటిగ్రేటెడ్​ స్పాయిలర్​, షార్క్​ ఫిన్​ యాంటీనా వంటి ఫీచర్స్​ ఇందులో ఉంటాయి. హ్యుందాయ్​ పోర్ట్​ఫోలియోలో.. 'ది మోస్ట్​ హ్యాండ్​సమ్​' కారుగా ఇది గుర్తింపు పొందింది.

ఇక ఇంటీరియర్​ విషయానికొస్తే.. హ్యుందాయ్​ ఐయానిక్​ 5లో డాష్​బోర్డు మీద ఓ భారీ కన్సోల్​ ఉంటుంది. ఇన్​ఫోటైన్​మెంట్ సిస్టెమ్​ ఉంటుంది. టూ స్పోక్​ ఫ్లాట్​ బటన్​ స్టీరింగ్​ వీల్​, సెకెండ్​ రోకు అడ్జస్టెబుల్​ సీటింగ్​, స్లైడింగ్​ సెంటర్​ కన్సోల్​ ఉంటాయి.

Hyundai Motors : అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులో ఉన్న మోడల్​ ప్రకారం.. హ్యుందాయ్​ ఐయానిక్​ 5లో 58కేడబ్ల్యూహెచ్​, 72.6కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ లభిస్తాయి. ఈ రెండు ఆర్​డబ్ల్యూడీ లదా ఏడబ్ల్యూడీ కాన్ఫిగరేషన్స్​తో ఉంటాయి. ఇండియా మార్కెట్​లో ఏ ప్యాక్​ను వినియోగిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం