Hyundai Staria Price : లాంచ్​కి సిద్ధంగా హ్యుందాయ్​ స్టారియా.. ధర ఎంతంటే!-hyundai staria price in india 2022 launch date and more detail ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Staria Price : లాంచ్​కి సిద్ధంగా హ్యుందాయ్​ స్టారియా.. ధర ఎంతంటే!

Hyundai Staria Price : లాంచ్​కి సిద్ధంగా హ్యుందాయ్​ స్టారియా.. ధర ఎంతంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 07, 2022 04:10 PM IST

Hyundai Staria Price : 'స్టారియా'ను లాంచ్​కు సిద్ధం చేసిన్నట్టు హ్యుందాయ్​ చెప్పింది. త్వరలో హ్యుందాయ్​ స్టారియా భారత రోడ్ల మీద దర్శనమివ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ కారు ఫీచర్స్​, ధరలపై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఓసారి చూద్దాము.

హ్యుందాయ్​ స్టారియా
హ్యుందాయ్​ స్టారియా (Hyundai Staria)

Hyundai Staria Price : హ్యుందాయ్​ స్టారియా.. మార్కెట్​లో గత కొంత కాలంగా ఈ ఎంపీవీ వెహికిల్​పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. హ్యుందాయ్​ స్టారియా.. లాంచ్​కు సిద్ధంగా ఉందని తాజాగా ఆటో సంస్థ ప్రకటించింది. ఫలితంగా ఈ ఎంపీవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో.. స్టారియాపై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాము.

ఫీచర్స్​.. ధర..

స్టారియా ఎంపీవీకి సంబంధించిన టీజర్​ను ఇప్పటికే లాంచ్​ చేసింది హ్యూందాయ్​. హుడ్​ మీద డీఆర్​ఎల్​ లైట్​ స్ట్రిప్​, పిక్సెల్​- స్టైల్​ వర్టికల్​ ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్​ వంటి ఫ్యూచరిస్టిక్​ డిజైన్​ ఎలిమెంట్స్​ ఇందులో ఉన్నాయి. సెంట్రల్లి లొకేటెడ్​ 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కూడా ఇందులో ఉండొచ్చు. 360 డిగ్రీ పార్కింగ్​ కెమెరా, పార్కింగ్​ సెన్సార్​ వంటివి ఇందులో ఉంటాయి. కియా కార్నివల్​కు ఉన్నట్టు మిడిల్​ రోలో కెప్టెన్​ సీట్స్​ ఉండే అవకాశం ఉంది. లెవర్స్​ కాకుండా.. స్టీట్లను అడ్జస్ట్​ చేసందుకు బటన్​ సిస్టెమ్​ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

Hyundai Staria launch date : ఇక పవర్​ డోర్​, రూఫ్​కు టెయిల్​గేట్​ కంట్రోల్స్​, వైయర్​లెస్​ ఫోన్​ ఛార్జర్​, గ్లాస్​ రూఫ్​ వంటివి ఈ హ్యుందాయ్​ స్టారియాలో మనం చూడవచ్చు.

స్టైలిష్​ కారు కోసం వెతుకుంటే.. హ్యుందాయ్​ స్టారియా మంచి ఆప్షన్​ అవుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ కారుకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇందులో డ్రైవింగ్​ చాలా సులభంగా ఉంటుంది. దీని డిజైన్​ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. స్లీక్​ డిజైన్​తో పాటు ఫ్యూయెల్​ ఎకానమీ, స్పేస్​కు ఇది పెట్టింది పేరు.

ఇండియాలో హ్యుందాయ్​ స్టారియా ప్రారంభ ధర రూ. 20లక్షలుగా ఉండే అవకాశం ఉంది. ఆన్​ రోడ్​ ధర ప్రస్తుతానికి అందుబాటులో లేదు.

డైెమెన్షన్స్​…

Hyundai Staria launch date in India : హ్యుందాయ్​ స్టారియా వీల్​బేస్​ 3273ఎంఎం. 5253ఎంఎం పొడవు, 1997ఎంఎం విడ్త్​. ఎత్తు 1990ఎంఎం. కార్పొరేట్​ వినియోగం కోసం 2,3 సీటర్​ మోడల్స్​ను కూడా రూపొందించింది హ్యుందాయ్​. కాగా ఈ హ్యుందాయ్​ స్టారియాను బిజినెస్​, హౌస్​హోల్డ్​ కాసం వాడుకోవచ్చు.

హ్యుందాయ్​ స్టారియాకు రెండు ఇంజిన్​ ఆప్షన్లు ఉన్నాయి. అవి.. 3.5లీటర్​ ఎంపీఐ పెట్రోల్​ ఇంజిన్​, 2.2 లీటర్​ వీజీటీ డీజిల్​ ఇంజిన్​. డీజిల్​ ఇంజిన్​లో 6 స్పీడ్​ మేన్యువల్​ లేదా 8స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మీషన్​ దీని సొంతం. ఇది 177హెచ్​పీ, 44కేజీ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. పెట్రోల్​ ఇంజిన్​.. 272 హెచ్​పీ, 33.8కేజీ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 8స్పీట్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ ఉంటుంది.

Hyundai Staria features : హ్యుందాయ్ స్టారియా.. లాంచ్​కి సిద్ధంగా ఉందని సంస్థ చెప్పినప్పటికీ.. కచ్చితమైన డేట్​ను ప్రకటించలేదు. అయితే.. ఈ స్టైలిష్​ కారు 2022 నవంబర్​ చివర్​లో లాంచ్​ అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు మార్కెట్​లో ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం