తెలుగు న్యూస్  /  Business  /  Iqoo Z7 Price In India Leaked Key Specifications Revealed

iQoo: ఐకూ జెడ్7 5జీ ధర లీక్.. అమోలెడ్‍ డిస్‍ప్లేతో: మరిన్ని వివరాలు కూడా..

11 March 2023, 10:40 IST

    • iQoo Z7 5G: ఐకూ జెడ్7 5జీ మొబైల్‍కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. కీలకమైన స్పెసిఫికేషన్లు, అంచనా ధర బయటికి వచ్చాయి.
iQoo: ఐకూ జెడ్7 5జీ ధర లీక్.. అమోలెడ్‍ డిస్‍ప్లేతో: మరిన్ని వివరాలు కూడా.. (Photo: iQoo)
iQoo: ఐకూ జెడ్7 5జీ ధర లీక్.. అమోలెడ్‍ డిస్‍ప్లేతో: మరిన్ని వివరాలు కూడా.. (Photo: iQoo)

iQoo: ఐకూ జెడ్7 5జీ ధర లీక్.. అమోలెడ్‍ డిస్‍ప్లేతో: మరిన్ని వివరాలు కూడా.. (Photo: iQoo)

iQoo Z7 5G: ఐకూ జెడ్7 5జీ మొబైల్ గురించి మరిన్ని వివరాలు బయటికి వచ్చాయి. ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది. ఈలోగానే దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‍కు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను యూట్యూబర్ అరుణ్ ప్రభుదేశాయ్ తన ట్రాకిన్ టెక్ ఛానెల్‍లో పోస్ట్ చేయటంతో వివరాలు లీకయ్యాయి. అమోలెడ్ డిస్‍ప్లేతో ఈ మొబైల్ రానుందని తెలిసింది. ఐకూ జెడ్7 5జీ ధర అంచనాలు కూడా బయటికి వచ్చాయి. పూర్తి వివరాలు ఇవే.

ఐకూ జెడ్7 5జీ డిజైన్, స్పెసిఫికేషన్లు

iQoo Z7 5G Specifications: అమోలెడ్ డిస్‍ప్లేతో ఐకూ జెడ్7 రానుంది. 1,300 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. ఇన్‍ డిస్‍ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్‍ప్లే టాప్ సెంటర్‌లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. డిస్‍ప్లే 6.5 ఇంచులుగా ఉంటుందని సమాచారం. ఇక ఈ ఫోన్ కుడిపక్క వాల్యూమ్, పవర్ బటన్స్ ఉంటాయి. కలర్ చేజింగ్ బ్యాక్ ప్యానెల్‍తో ఈ ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

iQoo Z7 5G Specifications: ఐకూ జెడ్7 5జీ మొబైల్‍ మీడియాటెక్ డైమన్సిటీ 920 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ వెనుక డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5,000mAh బ్యాటరీతో ఈ మొబైల్ వస్తుందని తెలుస్తోంది. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేయనుంది.

ఐకూ జెడ్7 5జీ లీకైన ధర

iQoo Z7 5G Price in India: ఐకూ జెడ్7 5జీ రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయని తెలుస్తోంది. బేస్ వేరియంట్ ధర రూ.17,999 దరిదాపుల్లో ఉంటుందని సమాచారం లీక్ అయింది. టాప్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంటుందని లీక్‍ల ద్వారా వెల్లడైంది. పసిఫిక్ నైట్, నార్వే బ్లూ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులోకి రావొచ్చు. అధికారిక ధరలను ఈనెల 21న లాంచ్ సమయంలో ఐకూ వెల్లడిస్తుంది.

ఐకూ జెడ్7 5జీ ఫోన్ ధర రూ.20వేలలోపు ఉంటుందని ఐకూ సీఈవో నిపుణ్ మర్యా కూడా హింట్ ఇచ్చారు. ఈ సెగ్మెంట్‍లో ఐఓఎస్ కెమెరాతో రానున్న తొలి మొబైల్ ఇదేనంటూ ఐకూ టీజ్ చేస్తోంది. ఐకూ జెడ్6 5జీ మొబైల్‍కు సక్సెసర్‌గా ఐకూ జెడ్7 5జీ వస్తోంది. అయితే చాలా విషయాల్లో ఈ నయా జెడ్ 7 5జీ అప్‍గ్రేడ్లతో వస్తోంది.