తెలుగు న్యూస్  /  Business  /  Iphone 14 Iphone 14 Plus Canary Yellow Option May Launch Soon

iPhone 14: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‍కు త్వరలో కొత్త కలర్ ఆప్షన్!

05 March 2023, 7:27 IST

    • iPhone 14, iPhone 14 Plus: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మొబైళ్లకు అతిత్వరలో ఎల్లో కలర్ ఆప్షన్ అందుబాటులోకి రానుందనే సమాచారం బయటికి వచ్చింది. వివరాలివే..
iPhone 14: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‍కు త్వరలో కొత్త కలర్ ఆప్షన్! (Photo: MacRumors)
iPhone 14: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‍కు త్వరలో కొత్త కలర్ ఆప్షన్! (Photo: MacRumors)

iPhone 14: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‍కు త్వరలో కొత్త కలర్ ఆప్షన్! (Photo: MacRumors)

iPhone 14, iPhone 14 Plus: ఐఫోన్‍లకు కలర్ ఆప్షన్‍ల విషయంలో ప్రయోగాలు చేస్తుంటుందని యాపిల్ (Apple). కొత్త సిరీస్ లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత కొత్త కలర్ ఆప్షన్‍లను తెస్తుంటుంది. ఈ క్రమంలోనే ఐఫోన్ 14 సిరీస్‍ (iPhone 14 Series)లో నయా కలర్ వేరియంట్‍ను తీసుకొచ్చేందుకు యాపిల్ రెడీ అయిందని సమాచారం. గతేడాది సెప్టెంబర్‌లో ఈ సిరీస్ లాంచ్ కాగా.. ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‍ను అందుబాటులోకి తీసుకురావాలని ఆ సంస్థ భావిస్తోందట. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మొబైళ్లకు ఎల్లో (Yellow) కలర్ వేరియంట్‍ను యాపిల్ త్వరలో తీసుకొస్తుందని జపాన్‍కు చెందిన బ్లాగ్ మ్యాక్ఒటాకర వెల్లడించింది. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ వీబోలో ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాలివే..

నాలుగేళ్ల తర్వాత ‘ఎల్లో’

iPhone 14, iPhone 14 Plus: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‍కు కనరీ ఎల్లో కలర్ ఆప్షన్‍‍ను యాపిల్ త్వరలో లాంచ్ చేస్తుందని మ్యాక్‍ఒటాకరా వెల్లడించింది. చివరిసారిగా ఎల్లో కలర్ వేరియంట్‍ను ఐఫోన్ 11 సిరీస్‍లో తీసుకొచ్చింది యాపిల్. అంటే నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఎల్లో కలర్ ఆప్షన్‍ను ఐఫోన్ 14 సిరీస్ కోసం యాపిల్ తీసుకొస్తుందన్న మాట. ఐఫోన్ 13కు గతేడాది గ్రీన్ కలర్ ఆప్షన్‍ను లాంచ్ చేసింది.

ప్రస్తుతం ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మొబైళ్లు మిడ్‍నైట్ (బ్లాక్), స్టార్ లైట్ (వైట్), ప్రొడక్ట్ రెడ్, పర్పుల్, బ్లూ కలర్లలో లభిస్తున్నాయి. కాగా, ఈ రెండు మోడళ్లకు ఎల్లో కలర్ ఆప్షన్‍ను వచ్చే వారంలోనే యాపిల్ తీసుకొస్తుందని మ్యాక్‍రూమర్స్ కూడా రిపోర్ట్ చేసింది. వచ్చే వారంలో ప్రొడక్ట్ ప్లానింగ్‍ను యాపిల్ వెల్లడిస్తుందనే సమాచారం తమకు ఉందని ఆ సంస్థ పేర్కొంది.

సాధారణంగా సెప్టెంబర్ నెలలో యాపిల్ కొత్త సిరీస్ ఫోన్‍ను యాపిల్ లాంచ్ చేస్తుంటుంది. ఆ తదుపరి ఏడాది మార్చి లేదా ఏప్రిల్‍లో ఆ సిరీస్‍లో కొత్త కలర్ వేరియంట్లను ప్రవేశపెడుతుంటుంది. ఐఫోన్ 13 సిరీస్‍కు గ్రీన్ కలర్ ఆప్షన్‍ను 2022 మార్చి 8న యాపిల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ ఫోన్‍లకు 2021 ఏప్రిల్‍లో పర్పుల్ కలర్ వేరియంట్‍ను అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ 8 సహా మరిన్ని సిరీస్‍లకు ఇదే విధానాన్ని పాటించింది.

ఐఫోన్ సేల్‍లను మరింత పెంచుకునేందుకు యాపిల్ ఈ కొత్త కలర్ ఆప్షన్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఐఫోన్ 14 సిరీస్‍లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ వచ్చాయి. అయితే అప్‍గ్రేడ్లు అధికంగా ఉండటంతో ప్రో మోడళ్లకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ అమ్మకాలు యాపిల్ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ తరుణంలో ఈ రెండు మోడళ్లకు ఎల్లో కలర్ ఆప్షన్ తెచ్చేందుకు యాపిల్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.