Flipkart Sale: ఫ్లిప్‍కార్ట్‌లో తగ్గింపు ధరతో ఐఫోన్ 14.. బిగ్ సేవింగ్ డేస్‍ సేల్‍లో..-apple iphone 14 gets huge discount on flipkart big saving days sale check offer deal details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Apple Iphone 14 Gets Huge Discount On Flipkart Big Saving Days Sale Check Offer Deal Details

Flipkart Sale: ఫ్లిప్‍కార్ట్‌లో తగ్గింపు ధరతో ఐఫోన్ 14.. బిగ్ సేవింగ్ డేస్‍ సేల్‍లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 16, 2023 02:33 PM IST

Apple iPhone 14 offer on Flipkart Big Saving Days: యాపిల్ ఐఫోన్ 14.. లాంచ్ తర్వాత మొదటిసారి భారీ డిస్కౌంట్‍కు లభిస్తోంది. ఫ్లిప్‍కార్ట్‌ సేల్‍లో ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Flipkart Sale: ఫ్లిప్‍కార్ట్‌లో తగ్గింపు ధరతో ఐఫోన్ 14.. బిగ్ సేవింగ్ డేస్‍లో..
Flipkart Sale: ఫ్లిప్‍కార్ట్‌లో తగ్గింపు ధరతో ఐఫోన్ 14.. బిగ్ సేవింగ్ డేస్‍లో.. (HT Tech)

Apple iPhone 14 offer on Flipkart Big Saving Days: యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 (iPhone 14) కొనాలనుకుంటున్న వారికి గుడ్‍న్యూస్ ఇది. ఈ మొబైల్‍ తగ్గింపు ధరకు అందుబాటులోకి వచ్చింది. లాంచ్ అయిన తర్వాత మొదటిసారి సుమారు రూ.13వేల డిస్కౌంట్‍తో ఐఫోన్ 14 లభిస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) సందర్భంగా ఫ్లిప్‍కార్ట్ ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పరిమిత కాల డిస్కౌంట్‍గా ఉండొచ్చు. బ్యాంక్ కార్డు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. యాపిల్ బయోనిక్ ఏ15 ప్రాసెసర్, ఫ్లాగ్‍షిప్ సెన్సార్లతో కూడిన కెమెరాలను ఈ ఐఫోన్ 14 కలిగి ఉంది. ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో ఈ మొబైల్‍పై ప్రస్తుత డిస్కౌంట్, ధర, కార్డు ఆఫర్లు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

ఐఫోన్ 14పై ప్రస్తుత ఆఫర్

Apple iPhone 14 offer on Flipkart Big Saving Days: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‍లో ఐఫోన్ 14 128జీబీ (iPhone 14 128GB) వేరియంట్ ధర ప్రస్తుతం రూ.66,999గా ఉంది. దీని లాంచ్ ధర రూ.79,900గా ఉండగా.. ప్రస్తుతం 16శాతం తగ్గింపు ధరతో లభిస్తోంది. లాంచ్ అయిన ఆరు నెలల తర్వాతే లేటెస్ట్ ఐఫోన్ ఇంత డిస్కౌంట్‍కు రావడం మంచి డీల్‍గానే ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు డిస్కౌంట్ దక్కుతుంది. ఒకవేళ ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్ కూడా వినియోగించుకుంటే ఐఫోన్ 14ను రూ.64,999కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు

iPhone 14 Specifications: 6.1 ఇంచుల సూపర్ రెటీనా XDR OLED డిస్‍ప్లేను ఐఫోన్ 14 కలిగి ఉంది. హెచ్‍డీఆర్ సపోర్ట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. డిస్‍ప్లేకు సెరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఐఓఎస్ 16తో ఈ ఫోన్ రన్ అవుతుంది. బయోనిక్ ఏ15 ప్రాసెసర్ ఈ ఐఫోన్ 14లో ఉంటుంది. 128జీబీ నుంచి 512జీబీ వరకు స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. 6జీబీ ర్యామ్‍తో ఐఫోన్ 14 వస్తోంది.

ఐఫోన్ 14 వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 12 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ సామర్థ్యంతో వస్తోంది.

స్పెసిఫికేషన్లపరంగా పోల్చి చూస్తే, ఐఫోన్ 13.. ఐఫోన్ 14 ఒకేలా కనిపిస్తాయి. అయితే 13తో పోలిస్తే ఐఫోన్ 14 పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ 15శాతం వరకు ఎక్కువగా ఉంటాయని యాపిల్ పేర్కొంటోంది. ఐఫోన్ 14 కొనాలనుకునే వారు ప్రస్తుత ఆఫర్‌ను వినియోగించుకుంటే మంచి డీల్‍గా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం