Flipkart Big Saving Days: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలు ఇవే.. 80శాతం వరకు డిస్కౌంట్లు.. ఈ ఫోన్‍లపై మళ్లీ..-flipkart big saving days 2023 sale dates announced check offers discounts bank card offers deals details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Flipkart Big Saving Days 2023 Sale Dates Announced Check Offers Discounts Bank Card Offers Deals Details

Flipkart Big Saving Days: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలు ఇవే.. 80శాతం వరకు డిస్కౌంట్లు.. ఈ ఫోన్‍లపై మళ్లీ..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 11, 2023 12:51 PM IST

Flipkart Big Saving Days 2023: బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ఫ్లిప్‍కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‍లో మొబైళ్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లతో పాటు అన్ని ప్రొడక్టులపై ఆఫర్లు ఉండనున్నాయి.

Flipkart Big Saving Days: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలు ఇవే
Flipkart Big Saving Days: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలు ఇవే (Reuters)

Flipkart Big Saving Days 2023: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేస్తోంది. ఈ సేల్ తేదీలను దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‍కార్ట్ ప్రకటించింది. ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు Flipkart Big Saving Days సేల్ ఉంటుంది. ఫ్లిప్‍కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందుగా 14వ తేదీనే సేల్ ప్రారంభం అవుతుంది. రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‍ను ప్రకటించగా.. ఇప్పుడు ఫ్లిప్‍కార్ట్ కూడా డేట్‍లను ఫిక్స్ చేసింది. ఫ్లిప్‍కార్ట్ సేల్‍లోనూ మొబైళ్లు, ఇయర్ ఫోన్స్, ల్యాప్‍టాప్‍లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్‍లు, రిఫ్రిజిరేటర్లతో పాటు అన్ని ప్రొడక్టులపై ఆఫర్లు ఉంటాయి. 80శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‍కార్ట్ పేర్కొంది. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Flipkart Big Saving Days 2023: బ్యాంక్ కార్డు ఆఫర్లు

ఫ్లి‍ప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈనెల 15వ తేదీన అర్ధరాత్రి మొదలవుతుంది. ఫ్లిప్‍కార్ట్ ప్లస్ మెంబర్లకు 14వ తేదీ అర్ధరాత్రి అందుబాటులోకి వస్తుంది. ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో సిటీ బ్యాంక్ (Citi Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) క్రెడిట్, డెబిట్ కార్డులతో కొంటే 10శాతం అదనంగా తగ్గింపు పొందవచ్చు. డీల్స్, ఆఫర్లను తెలుపుతూ ఇప్పటికే ఫ్లిప్‍కార్ట్ తన వెబ్‍సైట్‍లో ఓ పేజీని కూడా క్రియేట్ చేసింది.

ఈ మొబైళ్లపై మళ్లీ ఆఫర్లు

Flipkart Big Saving Days 2023: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో కొన్ని పాపులర్ మొబైల్స్ మళ్లీ ఆఫర్లకు అందుబాటులోకి రానున్నాయి. నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) ను రూ.25వేలలోపే దక్కించుకునే ఆఫర్ ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్, గూగుల్ పిక్సెల్ 7, పోకో ఎక్స్4 ప్రో 5జీ, మోటోరోలా ఎడ్జ్ 30, రియల్‍మీ 9ప్రో+ 5జీ మొబైళ్లు డిస్కౌంట్లకు లభించనున్నాయి. వీటితో పాటు దాదాపు చాలా ఫోన్లు ఆఫర్లకు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‍కార్ట్ పేర్కొంది.

Big Saving Days సేల్‍లో ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం వరకు ఆఫర్లను ఇవ్వనున్నట్టు ఫ్లిప్‍కార్ట్ పేర్కొంది. ల్యాప్‍టాప్‍లపై 45 శాతం వరకు, ఇయర్‌బడ్స్, స్పీకర్లపై 80 శాతం వరకు, స్మార్ట్ వాచ్‍లపై 85 శాతం వరకు, ట్యాబ్‍లపై 60 శాతం వరకు తగ్గింపు ధరలు ఉంటాయని వెల్లడించింది.

Flipkart Big Saving Days 2023: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో స్మార్ట్ టీవీలపై 50 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‍మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు లాంటి హోమ్ అప్లియన్సెస్‍పై 75 శాతం వరకు ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‍కార్ట్ పేర్కొంది.

కాగా, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈనెల 16వ తేదీన మొదలుకానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం