Amazon Great Republic day Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది.. 75శాతం వరకు ఆఫర్లు.. మొబైళ్లు, టీవీలపై..-amazon announces great republic day sale check sale dates deals discounts offers details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Amazon Announces Great Republic Day Sale Check Sale Dates Deals Discounts Offers Details

Amazon Great Republic day Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది.. 75శాతం వరకు ఆఫర్లు.. మొబైళ్లు, టీవీలపై..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 10, 2023 06:15 PM IST

Amazon Great Republic day Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది. ఈ సేల్ తేదీలను, కార్డ్ ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలను అమెజాన్ వెల్లడించింది. ఆఫర్లను టీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇవే.

Amazon Great Republic day Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది.. 75శాతం వరకు ఆఫర్లు
Amazon Great Republic day Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది.. 75శాతం వరకు ఆఫర్లు (PTI)

Amazon Great Republic day Sale: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon).. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని సేల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‍(Great Republic day Sale)ను అమెజాన్ తీసుకొస్తోంది. ఈ సేల్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 15వ తేదీన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మొదలవుతుంది. ప్రైమ్ సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారికి ఒక రోజు ముందుగా అంటే ఈనెల 14వ తేదీనే రిపబ్లిక్ డే సేల్ అందుబాటులోకి వస్తుంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‍లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లు, ట్యాబ్‍లు, ఇయర్‌ఫోన్స్, స్మార్ట్‌ వాచ్‍లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆఫర్లు ఉండనున్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు లాంటి హోమ్ అప్లియెన్సెస్ కూడా డిస్కౌంట్లకు రానున్నాయి. కొన్ని డీల్స్ వివరాలను కూడా అమెజాన్ ఇప్పటికే వెల్లడించింది. Amazon Great Republic day Sale వివరాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీలు

Amazon Great Republic day Sale dates: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై నాలుగు రోజుల పాటు సాగనుంది. అంటే 20వ తేదీ వరకు సేల్ ఉండనుంది. ప్రైమ్ మెంబర్లకు 14వ తేదీనే సేల్ అందుబాటులోకి వస్తుంది. 20 వరకు ఉంటుంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‍లో స్టేట్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ ఉంటుంది. ఎస్‍బీఐ క్రెడిట్ కార్డులతో ప్రొడక్టులను కొంటే 10 శాతం అదనపు తగ్గింపు పొందవచ్చు.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ డీల్స్, ఆఫర్లు

Amazon Great Republic day Deals: గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‍లో స్మార్ట్ ఫోన్‍లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ పేర్కొంది. సామ్‍సంగ్, షావోమీ, యాపిల్, వన్‍ప్లస్, ఐకూ, రియల్‍మీ, వివో, ఒప్పోతో పాటు అన్ని కంపెనీల మొబైళ్లపై ఆఫర్లు ఉండనున్నాయి.

ఈ సేల్‍లో ల్యాప్‍టాప్‍లపై 40 శాతం వరకు, స్మార్ట్ వాచ్‍లపై 75శాతం వరకు, హెడ్‍ఫోన్లపై 75 శాతం వరకు, ట్యాబ్‍లపై 60 శాతం వరకు ఆఫర్లు ఉంటాయని అమెజాన్ టీజ్ చేస్తోంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‍లో స్మార్ట్ టీవీలు 60 శాతం వరకు ఆఫర్లతో అందుబాటులోకి రానున్నాయి. రెడ్‍మీ, సామ్‍సంగ్, వన్‍ప్లస్, సోనీ, ఎల్‍జీ, హైసెన్స్, రియల్‍మీతో పాటు దాదాపు అన్ని బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై ఆఫర్లు ఉండనున్నాయి. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ తెలుపుతోంది.

WhatsApp channel