iPhone 13 offer: ఐఫోన్ 13పై మళ్లీ ఆఫర్లు
14 November 2022, 18:03 IST
- Apple iPhone 13 offers: యాపిల్ ఐఫోన్ 13 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ సందర్భంగా మరోసారి ఆఫర్లతో లభిస్తోంది.
iPhone 13 offer: ఐఫోన్ 13పై మళ్లీ ఆఫర్లు
Apple iPhone 13 offers: దసరా, దీపావళి సేల్లలో యాపిల్ ఐఫోన్ 13 మంచి ఆఫర్లకు లభించింది. మునుపెన్నడూ లేని ధరకు అందుబాటులోకి వచ్చింది. అయితే అప్పుడు సేల్స్ లో ఆఫర్లను మిస్ అయి.. ఈ ఐఫోన్ 13ను కొనాలని ఇప్పటికీ అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో మరోసారి ఆఫర్ ధరకు ఐఫోన్ 13 అందుబాటులోకి వచ్చింది. మొబైల్ బొనాంజా సేల్ (Flipkart Mobiles Bonanza Sale) సందర్భంగా ఈ డిస్కౌంట్ లభిస్తోంది. ఇది పరిమిత కాలమే ఉండనుంది. మరి ప్రస్తుతం ఐఫోన్ 13పై ఉన్న ఆఫర్స్ ఏవో చూడండి.
Apple iPhone 13 Offer: యాపిల్ ఐఫోన్ 13పై ఆఫర్లు
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 13 128జీబీ మోడల్ రూ.62,999 ధరకు అందుబాటులో ఉంది. సాధారణంగా రూ.69,990 ఉండే ఈ మొబైల్ సేల్‌లో రూ.7వేల తగ్గింపుతో లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే 5శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు.
Apple iPhone 13 Exchange Offer: ఎక్స్చేంజ్ ఆఫర్లు
ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.17,500 వరకు ఐఫోన్ 13పై డిస్కౌంట్ దక్కించుకోవచ్చు. అయితే మీరు ఎక్స్చేంజ్ చేసే పాత ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఎక్స్చేంజ్ విలువ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఐఫోన్ 11 ఎక్స్చేంజ్ చేసి, కండీషన్ బాగుంటే రూ.11,000 వరకు ఎక్స్చేంజ్ విలువను పొందవచ్చు. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ను కూడా ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 13ను కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డ్ ఆఫర్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అన్నీ కలిపి రూ.50,000 దరిదాపుల్లో iPhone 13 కొనుగోలు చేసే అవకాశం ప్రస్తుతం ఉంది. అయితే ఈ మొబైల్ బొనాంజా సేల్ నేటి (నవంబర్ 14) అర్ధరాత్రే ముగుస్తుంది. మరి ఐఫోన్ 13పై ఉన్న ఆఫర్ ను ఫ్లిప్‌కార్ట్ రేపటి నుంచి కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఐఫోన్ 13 కొనాలనుకుంటే ఆఫర్ ముగిసేలోగా దక్కించుకోవడం బెస్ట్.
Apple iPhone 13 Specifications : ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు
6.1 ఇంచుల సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో ఐఫోన్ 13 వస్తోంది. హెచ్డీఆర్10, డాల్బీ విజన్ సపోర్ట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. సెరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఐఓఎస్ 16తో వస్తుంది.
iPhone 13 వెనుక 12 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇప్పటికీ ఒకానొక బెస్ట్ కెమెరా ఫోన్‌గా ఐఫోన్ 13 ఉంది. ఐఫోన్ 13లో 3240mAh బ్యాటరీ ఉంటుంది. 23వాట్ల వైర్డ్, 15వాట్ల వైర్లెస్ చార్జింగ్కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.