తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Instagram Outage Today : ఇన్​స్టాగ్రామ్​ డౌన్​.. లక్షలాది మంది యూజర్లపై ఎఫెక్ట్!

Instagram outage today : ఇన్​స్టాగ్రామ్​ డౌన్​.. లక్షలాది మంది యూజర్లపై ఎఫెక్ట్!

Sharath Chitturi HT Telugu

22 May 2023, 6:43 IST

  • Instagram outage today : పలు దేశాల్లో ఇన్​స్టాగ్రామ్​ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. యాప్​ పనిచేయడం లేదంటూ ఇతర సామాజిక మాధ్యమాల్లో యూజర్లు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఇన్​స్టాగ్రామ్​ బృందం.. యాప్​ను పునరుద్ధరించింది.

ఇన్​స్టాగ్రామ్​ డౌన్​.. లక్షలాది మంది యూజర్లపై ఎఫెక్ట్​- కారణం ఏంటి?
ఇన్​స్టాగ్రామ్​ డౌన్​.. లక్షలాది మంది యూజర్లపై ఎఫెక్ట్​- కారణం ఏంటి? (REUTERS)

ఇన్​స్టాగ్రామ్​ డౌన్​.. లక్షలాది మంది యూజర్లపై ఎఫెక్ట్​- కారణం ఏంటి?

Instagram outage today : సామాజిక మాధ్యమ దిగ్గజం, ప్రముఖ ఫొటో షేరింగ్​ యాప్​ ఇన్​స్టాగ్రామ్​ సేవలు అమెరికా సహా పలు దేశాల్లో కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. పీక్​ దశలో 1,80,000 మంది యూజర్లకు ఇన్​స్టాగ్రామ్​ పనిచేయలేదని.. ఔటేజ్​ ట్రాకింగ్​ వెబ్​సైట్​ Downdetector.com వెల్లడించింది. అనేక గంటల పాటు ప్రయత్నించిన అనంతరం.. యాప్​ సేవలను పునరుద్ధరించింది ఈ మెటా ఆధారిత ఇన్​స్టాగ్రామ్​.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

కారణం ఏంటి..?

అమెరికా స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు ఈ ఇన్​స్టాగ్రామ్​ ఔటేజ్​ మొదలైంది. యూజర్లు ఒక్కొక్కరుగా ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. ఇన్​స్టాగ్రామ్​ను ట్విట్టర్​లో ట్యాగ్​ చేస్తూ.. యాప్​ పనిచేయడం లేదని వెల్లడించారు. ఫలితంగా #instagramdown హ్యాష్​ట్యాగ్​ ట్రెండింగ్​గా మారింది.

Instagram Down today : పీక్​ ఔటేజ్​ సమయంలో అమెరికాలో 1,00,000మంది.. బ్రిటన్​లో 56వేల మంది, కెనడాలో 24వేల మందికి ఇన్​స్టాగ్రామ్​ పనిచేయలేదని సమాచారం. యాప్​ పునరుద్ధరణకు ఇన్​స్టాగ్రామ్​ బృందం తీవ్రంగా శ్రమించింది. గంటల వ్యవధి అనంతరం ఇన్​స్టాగ్రామ్​ను పునరుద్ధరించింది. అయితే.. ఇన్​స్టాగ్రామ్​ ఔటేజ్​కు గల కారణాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.

కాగా.. ఈ దఫా ఇన్​స్టాగ్రామ్​ ఔటేజ్​ భారత్​పై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఇండియన్​ యూజర్లు సాధారణంగానే లాగిన్​ అయ్యి, న్యూస్​ ఫీడ్​ను చూశారు. ఫొటోలు, వీడియోలు అప్లోడ్​ చేశారు. 

ట్విట్టర్​కు పోటీగా..!

మరో సామాజిక మాధ్యమ దిగ్గజ ట్విట్టర్​కు పోటీగా ఒక కొత్త యాప్​ను తీసుకొచ్చేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది ఇన్​స్టాగ్రామ్​. ఇదొక టెక్స్ట్​ ఆధారిత యాప్​ని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. ఈ యాప్​నకు ఇంకా పేరు పెట్టలేదని తెలుస్తోంది. అయితే.. ఇన్​స్టాగ్రామ్​ యూజర్​ ఐడీ, పాస్​వర్డ్​తో ఇందులో లాగిన్​ అవ్వొచ్చని సమాచారం. 500 క్యారెక్టర్లతో కూడిన టెక్స్ట్​లను ఇందులో పోస్ట్​ చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ యాప్​పై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.