తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Instagram Outage : ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టాగ్రామ్​ సేవలకు అంతరాయం!

Instagram Outage : ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టాగ్రామ్​ సేవలకు అంతరాయం!

31 October 2022, 21:10 IST

    • Instagram Outage : ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టాగ్రామ్​ సేవలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టాగ్రామ్​ సేవలకు అంతరాయం!
ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టాగ్రామ్​ సేవలకు అంతరాయం! (AP)

ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టాగ్రామ్​ సేవలకు అంతరాయం!

Instagram Outage : ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టాగ్రామ్​ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేలాది మంది ఇన్​స్టాగ్రామ్ ​అకౌంట్​లు లాక్​ అయిపోయినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇంకొందరికి యాప్​ క్రాష్​ అవుతున్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఈ నేపథ్యంలో కొంతమంది అకౌంట్​లు సస్పెండ్​ అయినట్టు సమాచారం. సస్పెండ్​ అయిన అకౌంట్​ను పునరుద్ధరించేందుకు ఈమెయిల్​, ఫోన్​ నెంబర్​ వంటి వివరాలను యాప్​ అడుగుతున్నట్టు ఓ యూజర్​ చెప్పారు.

Instagram down : ఈ వ్యవహారంపై స్పందించిన ఇన్​స్టాగ్రామ్​.. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.

"ఇన్​స్టాగ్రామ్​ యాక్సెస్​ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలిసింది. ఇబ్బందులకు క్షమాపణలు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాము," అని ట్వీట్​ చేసింది.

అకౌంట్​లు సస్పెండ్​ అయ్యాయా? అన్న ప్రశ్నకు ఇన్​స్టాగ్రామ్​ ఇంకా సమాధానం ఇవ్వలేదు.

తాజాగా.. దాదాపు 7000మందిపై ఇన్​స్టాగ్రామ్​ ఔటేజ్​ ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్​ మీడియా యాప్స్​ను పర్యవేక్షించే డౌన్​ డిటెక్టర్​ వెల్లడించింది.

మొన్న వాట్సాప్​.. నేడు ఇన్​స్టా..

Whatsapp down : సామాజిక మాధ్యమాల సేవలు నిలిచిపోవడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే..ఫేస్​బుక్​ ఆధారిత వాట్సాప్​ సేవలు గంటకుపైగా నిలిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాతే.. ఇప్పుడు అదే ఫేస్​బుక్​ ఆధారిత ఇన్​స్టా సేవలు కూడా ఆగిపోయాయి.

వాట్సాప్​ సేవలు నిలిచిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్​ విపరీతంగా పేలాయి. వాట్సాప్​కు గ్రహణం పట్టిందని జోక్​లు వేసుకున్నారు నెటిజన్లు.

Instagram down today: కాగా.. ఇన్​స్టాగ్రామ్​ సేవలు నిలిచిపోవడం నెలన్నర రోజుల వ్యవధిలో ఇది రెండోసారి! సెప్టెంబర్​ 23న కూడా ఇన్​స్టా.. చాలా మందికి పని చేయలేదు. ఫీడ్​ చూడలేకపోయారు. సమస్యను పరిష్కరించి.. తిరిగి యాప్​ను లాంచ్​ చేసింది ఇన్​స్టాగ్రామ్​ టీమ్​.

తదుపరి వ్యాసం