Instagram Notes feature : ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నోట్స్’ ఫీచర్.. ఇక రాసేయండి!
Instagram Notes feature : 'నోట్స్' అనే కొత్త ఫీచర్‌తో వచ్చేసింది ఇన్స్టాగ్రామ్. ఫీచర్ వివరాలు, ఎలా ఉపయోగించాలి? అన్న విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
Instagram Notes feature : ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో యూజర్స్ ముందుకు వస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్. తాజాగా 'నోట్స్' అనే కొత్త ఫీచర్‌తో వచ్చేసింది. ఇకపై యూజర్స్ 'నోట్స్'తో తమకు నచ్చింది రాసి, ఇతరులతో పంచుకోవచ్చు.
ఈ ఇన్స్టాగ్రామ్ నోట్స్ ఫీచర్.. స్టేటస్‌ను పోలి ఉంటుంది. స్టేటస్ అనేది న్యూస్ ఫీడ్‌లో కనిపిస్తే.. నోట్స్ ఫీచర్ మాత్రం డీఎంలో ఉంటుంది. 24గంటల తర్వాత మనం రాసే నోట్స్ డిలీట్ అయిపోతుంది. ఈ నోట్స్ ఫీచర్‌కు 60 క్యారెక్టర్ లిమిట్ కూడా ఉంది.
సమాచారాన్ని తొందరగా, సింపుల్‌గా పంచుకోవడం కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. అయితే యూజర్ల నుంచి ఈ ఫీచర్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది.
Instagram new feature : ఇన్స్టాగ్రామ్ నోట్స్ ఫీచర్‌ని ఇలా ఉపయోగించండి.
- స్టెప్ 1:- ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ యాప్‌ని అప్డేట్ చేయండి.
- స్టెప్ 2:- ఇన్స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేయండి.
- స్టెప్ 3:- డీఎం సెక్షన్లోకి వెళ్లండి.
- స్టెప్ 4:- పైన కనిపిస్తున్న 'యువర్ నోట్'పై క్లిక్ చేయండి. మీకు అనిపించింది టైప్ చేయండి.
- స్టెప్ 5:- ఫాలోవర్స్, క్లోజ్ ఫ్రెండ్స్.. ఎవరికి కనిపిచాలో సెలక్ట్ చేసుకోండి.
- స్టెప్ 6:- షేర్ బటన్ ప్రెస్ చేస్తే.. మీ నోట్స్ షేర్ అవుతుంది.
Instagram nudity feature : న్యూడిటీ ఫీచర్
నియోగదారులకు 'సైబ్ఫ్లాషింగ్' నుంచి మరింత రక్షణ కల్పించే దిశగా ఇన్స్టాగ్రామ్ కృషిచేస్తున్నట్టు నివేదికలు వచ్చాయి. ఈ మేరకు కొత్త ఫీచర్‌ను ఇన్స్టాగ్రామ్ పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 'న్యూడిటీ ప్రొటెక్షన్' ఫీచర్.. లైంగిక, అసభ్యకరమైన ఫొటోలు యూజర్ల ఇన్‌బాక్స్‌లోకి చేరకుండా ఉపయోగపడుతుందని సమాచారం.
ఆన్లైన్లో అసభ్యకర, లైంగికపరమైన ఫొటోలను పంపించి, వేధించడాన్ని సైబర్ ఫ్లాషింగ్ అంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య కాలంలో ఇవి చాలా పెరిగిపోయాయి. ముఖ్యంగా మహిళలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఘటననలు అడ్డుకునేందుకు ఇన్‌బాక్స్‌లోకి వచ్చే మెసేజ్‌లను ఆటోమెటిక్‌గా ఫిల్టర్ చేసే దిశగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఇన్స్టాగ్రామ్ ప్రయత్నిస్తోంది. న్యూడ్ ఫొటోలు, అసభ్యకర మెసేజ్‌ల నుంచి యూజర్లను రక్షించేందుకు మెషిన్ లర్నింగ్ సాయాన్ని ఇన్స్టాగ్రామ్ తీసుకుంటున్నట్టు నివేదిక పేర్కొంది.
Instagram latest news : ఇన్స్టాగ్రామ్ ఓనర్ సంస్థ 'మెటా' డెవలపర్ అలెస్సాండ్రో పౌజి.. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. "ఛాట్‌లో న్యూడిటీ నుంచి రక్షణ కల్పించే ఫీచర్‌పై ఇన్స్టాగ్రామ్ పనిచేస్తోంది. ఫొటోలను ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ చేయలేదు. కానీ న్యూడిటీతో కూడిన ఫొటోలను అడ్డుకుంటుంది," అని రాసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీటితో పాటు.. ‘రీపోస్ట్’ ఫీచర్‌పైనా ఇన్స్టాగ్రామ్ కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం