Instagram down : ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం
Instagram down : ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటల తర్వాత సమస్యను ఇన్స్టాగ్రామ్ పరిష్కరించింది.
Instagram down : సామాజిక మాధ్యమ దిగ్గజం 'ఇన్స్టాగ్రామ్' సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. వేలాది మందికి చాలా సేపటి వరకు ఇన్‌స్టా ఫీడ్ పనిచేయలేదు. డీఎంతో పాటు ఇతర ఫీచర్స్ కూడా సరిగ్గా పనిచేయలేదు. పరిస్థితిపై వెంటనే స్పందించిన ఇన్స్టాగ్రామ్.. సంబంధిత సమస్యను పరిష్కరించింది.
Instagram is not working : ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టా 'డౌన్'..
డౌన్‌డిటెక్టర్ ప్రకారం ఫిర్యాదుల్లో 66శాతం యాప్ క్రాష్ గురించి ఉన్నాయి. 24శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలు, 10శాతం లాగిన్ సమస్యలు ఉన్నాయి. కొందరు స్టోరీలు ఓపెన్ చేయలేకపోతున్నట్టు తెలిసింది. ఇంకొందరు మెసేజ్‌లు పంపలేకపోయారు, రిసీవ్ చేసుకోలేకపోయారు. కొత్త పోస్ట్‌లు.. ఫీడ్‌లో కనిపించలేదు.
ఇన్స్టాగ్రామ్ డౌన్ వ్యవహారంపై ట్విట్టర్లో ట్వీట్లు వెల్లువెత్తాయి. #instagramdown హ్యాష్‌ట్యాగ్.. ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. మీమ్స్ కూడా విపరీతంగా పేలాయి.
కొన్ని గంటల తర్వాత ఇన్స్టాగ్రామ్ సేవలను పునరుద్ధరించినట్టు సంస్థ వెల్లడించింది.
"మేము తిరిగి వచ్చేశాము. ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడానికి గల కారణాలను మేము పరిష్కరించాము. సేవల అంతరాయానికి మా క్షమాపణలు," అని ట్వీట్ చేసింది ఇన్స్టాగ్రామ్.
అయితే.. అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు డౌన్ అయ్యింది? అన్న విషయం తెలియరాలేదు.
ఇటీవలి కాలంలో టెక్ యాప్స్, సోషల్ మీడియా సైట్లల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పేటీఎం, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
సంబంధిత కథనం