Chandigarh crime news : ఇన్​స్టాగ్రామ్​ స్నేహం.. భారీగా మోసపోయిన మహిళ!-chandigarh woman loses 3 4 lakhs to man she befriended online ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandigarh Crime News : ఇన్​స్టాగ్రామ్​ స్నేహం.. భారీగా మోసపోయిన మహిళ!

Chandigarh crime news : ఇన్​స్టాగ్రామ్​ స్నేహం.. భారీగా మోసపోయిన మహిళ!

Sharath Chitturi HT Telugu
Apr 21, 2023 07:37 AM IST

Chandigarh crime news : మహిళకు అతను ఇన్​స్టాగ్రామ్​ ద్వారా పరిచయమయ్యాడు. విలువైన పార్సిల్​ పంపిస్తున్నాను అని చెప్పి నమ్మించాడు. చివరికి ఆమె భారీగా మోసపోయింది. ఈ ఘటన ఛండీగఢ్​లో జరిగింది. అసలేం జరిగిందంటే..

పార్సిల్​ పేరుతో ఇన్​స్టాగ్రామ్​ ఫ్రెండ్​ దోపిడీ..
పార్సిల్​ పేరుతో ఇన్​స్టాగ్రామ్​ ఫ్రెండ్​ దోపిడీ..

Chandigarh crime news : దేశంలో సైబర్​ క్రైమ్స్​ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సోషల్​ మీడియాలో పరిచయం అవ్వడం, అవతలి వ్యక్తిని నమ్మించి, భారీగా దోచుకోవడం సైబర్​ నేరస్థులకు అలవాటైపోయింది. ఎన్నిసార్లు చెప్పినా, అధికారులు ఎంత హెచ్చరించినా.. ప్రజలు అపరిచితులను నమ్మి, మోసపోతున్నారు. ఛండీగఢ్​లో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ దాదాపు రూ. 3.5లక్షలు పొగొట్టుకుంది!

పూర్తిగా నమ్మేసి.. భారీగా మోసపోయి..

సంబంధిత మహిళ ఛండీగఢ్​లోని ఓ ప్రాంతంలో నివాసముంటోంది. కాగా.. డేవ్​ అనే వ్యక్తితో ఆమెకు కొంతకాలం క్రితం ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమైంది. రెండు నెలల పాటు వీరిద్దరు ఛాటింగ్​ చేశారు.

Cyber crime news : ఈ క్రమంలో మహిళకు డేవ్​ ఓ విషయం చెప్పాడు. 'నేను విదేశాల్లో ఉంటాను. ఏప్రిల్​ 18న ఇండియాకు వస్తున్నాను. నిన్ను కలుస్తాను. అయితే అంతకుముందే నీకు ఓ పార్సిల్​ పంపిస్తాను. అది విలువైనది,' అని మహిళతో డేవ్​ అన్నాడు. అందుకు ఆ మహిళ.. 'నువ్వు ఎలాగో ఇండియాకు వస్తున్నావు కదా. నువ్వే తీసుకుని రా,' అని బదులిచ్చింది. తాను సముద్ర మార్గంలో ఇండియాకు వస్తున్నట్టు, ఎక్కువ బరువు మోయడం కష్టమని చెప్పి మహిళను నమ్మించాడు డేవ్​. ఆ మహిళ పార్సిల్​ తీసుకునేందుకు అంగీకరించింది.

రోజులు గడిచాయి. గత నెల 14న మహిళకు ఓ ఫోన్​ వచ్చింది. ఢిల్లీ కస్టమ్స్​ ఆఫీస్​ నుంచి ఫోన్​ చేస్తున్నట్టు ఓ వ్యక్తి మాట్లాడాడు. పార్సిల్​ కోసం రూ. 50వేలు చెల్లించాలని చెప్పాడు. మహిళ డేవ్​కు కాల్​ చేసింది. 'ఇండియా వచ్చాక నేను డబ్బులిస్తాను. నువ్వు ఇప్పుడు ఇచ్చేయ్​,' అని జవాబిచ్చాడు. అది నమ్మిన మహిళ రూ. 50వేలు చెల్లించింది.

Woman duped huge money : ఇంకొన్ని రోజులు గడిచాయి. ఈ మహిళకు మళ్లీ కాల్​ వచ్చింది. సంబంధిత పార్సిల్​లో అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలు, విదేశీ కరెన్సీ నోట్లు ఉన్నాయని ఫోన్​లో చెప్పారు. చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే రూ. 1.88లక్షలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఆ మహిళ డబ్బులు కట్టింది.

రెండు రోజుల తర్వాత ఆ మహిళకు మళ్లీ ఫోన్​ వచ్చింది. స్టాంప్​ డ్యూటీ కోసం రూ. 1లక్ష కట్టాలని డిమాండ్​ చేశారు. ఆమె కట్టేసింది! ఇలా పేమెంట్స్​ చేస్తున్నప్పటికీ.. ఆమెకు పార్సిల్​ అందలేదు. మరోవైపు డేవ్​ ఫోన్​ లిఫ్ట్​ చేయడం ఆపేశాడు.

Chandigarh latest news : చివరికి.. తాను మోసపోయినట్టు మహిళకు తెలిసి వచ్చింది. పోలీసులను ఆశ్రయించింది. 'ప్రైవేట్​ బ్యాంక్​లో లోన్​ తీసుకుని డబ్బులు కట్టాల్సి వచ్చింది. నేను మోసపోయాను,' అని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

ఛండీగఢ్​ పోలీసు విభాగానికి చెందిన సైబర్​ సెల్​ బృందం.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం