Triple Talaq : సైబర్​ మోసానికి డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్​!-odisha man gives triple talaq to wife as she loses money to cyber frauds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Triple Talaq : సైబర్​ మోసానికి డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్​!

Triple Talaq : సైబర్​ మోసానికి డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్​!

Sharath Chitturi HT Telugu
Apr 09, 2023 06:15 AM IST

Odisha triple talaq case : సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 1.5లక్షలు పోగొట్టుకుంది ఓ మహిళ. ఆ విషయం తన భర్తకు చెప్పింది. అతను ఆమెకు ట్రిపుల్​ తలాక్​తో విడాకులు ఇచ్చాడు! ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

సైబర్​ మోసానికి డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్​!
సైబర్​ మోసానికి డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్​!

Odisha triple talaq case : ఇండియాలో ట్రిపుల్​ తలాక్​పై 2019లోనే నిషేధం పడింది. అయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ట్రిపుల్​ తలాక్​ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశాలో జరిగింది. సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 1.5లక్షలు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్​ తలాక్​తో విడాకులు​ ఇచ్చాడు ఓ వ్యక్తి.

ఇదీ జరిగింది..

32ఏళ్ల మహిళ.. తన కుటుంబంతో కలిసి ఒడిశాలోని కేంద్రపుర జిల్లాలో నివాసముంటోంది. ఆమెకు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారికి 16-17ఏళ్ల వయస్సు ఉంటుంది.

Triple Talaq case in Odisha : కాగా.. ఇటీవలే ఆ మహిళ సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. అయితే.. సైబర్​ మోసానికి ఆమె రూ. 1.5లక్షల వరకు పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఆమె ఎవరికి చెప్పలేదు. లోలోపల చాలా బాధపడింది. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు.

గుజరాత్​లో ఉన్న ఆమె భర్త ఈ నెల 1న ఆ మహిళకు ఫోన్​ చేశాడు.. ఆ రూ. 1.5లక్షల గురించి ప్రశ్నించాడు. అప్పుడు ఆమె నిజం చెప్పేసింది. సైబర్​ మోసానికి తాను డబ్బులు పోగొట్టుకున్నట్టు అంగీకరించింది. వెంటనే ఫోన్​లో 'తలాక్​' అన్న పదాన్ని మూడుసార్లు ఉచ్చరించాడు ఆ వ్యక్తి. డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్​ తలాక్​ ఇచ్చాడు.

వరకట్న వేధింపులు.. ట్రిపుల్​ తలాక్​

Odisha crime news : బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ట్రిపుల్​ తలాక్​ విషయాన్ని చెప్పింది. అంతేకాకుండా.. తాను అనేకమార్లు వరకట్నం వేధింపులకు గురైనట్టు ఫిర్యాదు చేసింది. సంబంధిత వ్యక్తిపై కేంద్రపుర సదర్​ పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ సరోజ్​ కుమార్​ సాహూ.. వరకట్న వేధింపుల చట్టం, ముస్లిం మహిళల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ చట్టం ప్రకారం.. దోషిగా తేలిన వారికి గరిష్ఠంగా 3ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

తలాక్​ అన్న పదాన్ని భర్త మూడుసార్లు ఉచ్చరిస్తే.. భార్యతో విడాకులు తీసుకున్నట్టు! ఇది దేశంలో అనేక శతాబ్దాలుగా ఆచరణలో ఉంది. కాగా 2017లో ట్రిపుల్​ తలాక్​పై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. కానీ అనేక వర్గాల నుంచి సుప్రీంకోర్టు తీర్పునకు మద్దతు లభించింది. చాలా మంది ముస్లిం మహిళలు కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం