Mobile messenger apps blocked : 14 మెసెంజర్​ యాప్స్​ను బ్లాక్​ చేసిన కేంద్రం-india blocks 14 mobile messenger apps over security concerns ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Blocks 14 Mobile Messenger Apps Over Security Concerns

Mobile messenger apps blocked : 14 మెసెంజర్​ యాప్స్​ను బ్లాక్​ చేసిన కేంద్రం

Sharath Chitturi HT Telugu
May 01, 2023 11:10 AM IST

Mobile messenger apps blocked in India : 14 మెసెంజర్​ యాప్స్​ను బ్లాక్​ చేసింది కేంద్ర ప్రభుత్వం. వీటిని ఉగ్ర ముఠాలు సమాచార వ్యవస్థగా మార్చుకున్నాయని తెలిసి, ఈ నిర్ణయం తీసుకుంది.

14 మెసెంజర్​ యాప్స్​ను బ్లాక్​ చేసిన కేంద్రం
14 మెసెంజర్​ యాప్స్​ను బ్లాక్​ చేసిన కేంద్రం

Mobile messenger apps blocked in India : ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద బృందాలు వినియోగిస్తున్నాయంటూ.. 14 మొబైల్​ మెసెంజర్​ యాప్స్​పై నిషేధం విధించింది. జమ్ముకశ్మీర్​ వంటి ప్రాంతాల్లో పాకిస్థాన్​ నుంచి ఆదేశాలు తీసుకునేందుకు, వాటిని తమ మద్దతుదారులకు పంచేందుకు ఉగ్ర ముఠాలు ఈ యాప్స్​ను వాడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

నిషేధానికి గురైన 14 యాప్స్​ ఇవే..

క్రిప్సివర్​, ఎనిగ్మా, సేఫ్​స్విస్​, విక్​మెర్​, మిడియాఫైర్​, బ్రైర్​, బీచాట్​, నాండ్​బాక్స్​, కానియన్​, ఐఎంఓ, ఎలిమెంట్​, సెకెండ్​ లైన్​, జాంగి, థ్రిమా వంటి 14 మెసెంజర్​ యాప్స్​ను కేంద్రం బ్లాక్​ చేసింది. భద్రత, నిఘా ఏజెన్సీల సిఫార్సుల మేరకు ఆయా యాప్స్​ను నిషేధించింది కేంద్రం.

భారత దేశాల చట్టాలను ఉల్లంఘిస్తూ, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా చర్యలు చేపడుతున్న ఆయా యాప్స్​​ను నిషేధించాలని ఏజెన్సీలు ప్రభుత్వానికి ఇటీవలే ఓ లిస్ట్​ను ఇచ్చాయి. ఫలితంగా ఈ యాప్స్​.. 2000 ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ యాక్ట్​ సెక్షన్​ 69ఏ కింద నిషేధానికి గురయ్యాయి.

India Government blocks messenger apps : "ఓజీడబ్ల్యూలు (ఓవర్​గ్రౌండ్​ వర్కర్స్​), ఉగ్రవాదుల మధ్య సమాచార వ్యవస్థగా ఉపయోగపడుతున్న వాటిపై ఏజెన్సీ ఎప్పటికప్పుడు ఫోకస్​ చేస్తుంది. ఇలాంటి ఓ ఛానెల్​ను ట్రాక్​ చేస్తున్న సమయంలోనే.. ఈ 14 యాప్స్​కు సంబంధించి ఇండియాలో ఎలాంటి అధికారిక ప్రాతినిధ్యం లేదని ఏజెన్సీలకు తెలిసింది. వీటిల్లో జరిగే కార్యకలాపాలను ట్రాక్​ చేయడం కూడా కష్టమని అర్థం చేసుకున్నాయి. ఫలితంగా వీటిని బ్యాన్​ చేయాలని ప్రభుత్వానికి సూచించాయి. ఇప్పుడు ప్రభుత్వం వీటిని నిషేధించింది," అని ఓ అధికారి.. మీడియాకు వివరించారు.

ప్రభుత్వం కఠిన చర్యలు..

YouTube channels blocked in India : ఉగ్రవాదంతో పాటు దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సమాచార వ్యవస్థలపై ఇటీవలే కాలంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. గతేడాది నుంచి ఇప్పటివరకు పలు దఫాలుగా అనేక యూట్యూబ్​ ఛానెల్స్​, ఎఫ్​బీ పేజ్​లను నిషేధించింది. వీటికి పాకిస్థాన్​తో లింక్స్​ ఉన్నాయని, దేశంలో అలజడులు సృష్టించేందుకు.. ఉగ్రవాదులు వీటిని ఉపయోగించుకుంటున్నాయన్న కారణాలతో బ్యాన్​ చేసింది. ఇక తాజాగా 14 మొబైల్​ మెసెంజర్​ యాప్స్​ నిషేధానికి గురయ్యాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం