తెలుగు న్యూస్  /  Business  /  Gold Rate Today November 24 Latest Gold Silver Prices In India Hyderabad Know Full Details

Gold, Silver Price Today: వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే

24 November 2022, 6:11 IST

    • Gold, Silver prices today: బంగారం, వెండి ధరలు నేడు మరింత తగ్గాయి. భారత మార్కెట్‍లో దిగి వచ్చాయి. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Price Today: వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే
Gold, Silver Price Today: వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే

Gold, Silver Price Today: వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే

Gold Price Today: దేశీయ మార్కెట్‍లో వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గాయి. నేడు (నవంబర్ 24) పసిడి మరింత దిగివచ్చింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) బంగారం ధర నేడు రూ.100 తగ్గుముఖం పట్టి.. రూ.48,250కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 డౌన్ అయింది. నేడు రూ.52,640గా ఉంది. నేడు వెండి ధర కూడా కాస్త దిగి వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నేడు పసిడి ధరలు తగ్గాయి. ఆ వివరాలు ఇవే..

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్ బులియన్ మార్కెట్‍లోనూ నేడు పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 48,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల వెల రూ.52,640కు చేరింది. విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతిలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

Gold Price Today: ఈ ప్రధాన నగరాల్లో..

దేశరాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,400గా ఉంది. 24 క్యారెట్ల (10 గ్రాములు) గోల్డ్ రేట్ రూ.52,800కు తగ్గింది. లక్నో, జైపూర్ లోనూ ఇవే ధరలు కొనసాగాయి. పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ కోల్‍కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.48,250గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ప్రైజ్ రూ.52,640 వద్ద స్థిరపడింది. బెంగళూరు, ముంబై, పూణె, నాగ్‍పూర్ లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల (10 గ్రాములు) పసిడి వెల రూ.48,960, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,410గా ఉంది. మంగళూరు, సూరత్, అహ్మదాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.48,300, 24 క్యారెట్ల ధర రూ.52,700కు చేరింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ బంగారం ధర కాస్త పెరిగింది. స్పాట్ బంగారం ఔన్స్ రేట్ ప్రస్తుతం 1,753 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కరెన్సీ మారకం విలువల్లో హెచ్చుదగ్గులతో పాటు మరిన్ని కారణాలతో పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Silver Prices: వెండి కూడా కిందికి..

నేడు పసిడినే ఫాలో అయింది వెండి. భారత మార్కెట్‍లో నేడు సిల్వర్ రేటు తగ్గింది. కిలో వెండిపై ధర రూ.200 డౌన్ అవగా.. రూ.61,000 వద్ద ఉంది. 100 గ్రాముల ధర రూ.6,100గా ఉంది.

అయితే, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరులో నేడు కిలో వెండి కాస్త పెరిగింది. ఈ నగరాల్లో కిలో సిల్వర్ ధర రూ.67,500గా ఉంది. అదే ఢిల్లీ, ముంబై, కోల్‍కతాలో వెండి రేట్ తగ్గింది. ఈ సిటీల్లో కిలో వెండి ధర రూ.61,000గా కొనసాగుతోంది. అహ్మదాబాద్, జైపూర్, నాసిక్‍లోనూ ఇదే ధరకు లభిస్తుంది.

Platinum Prices Today: ప్లాటినం కాస్త పైకి..

ప్లాటినం ధరలు మాత్రం నేడు స్వల్పంగా కాస్త పెరిగాయి. 10 గ్రాముల ప్లాటినం ప్రైస్ రూ.10 పెరిగి.. రూ.26,080కు చేరింది. 100 గ్రామల ధర రూ.2,60,800గా ఉంది. దేశంలోని మిగిలిన నగరాల్లోనూ ప్లాటినమ్ ఇదే ధరకు ఉంది.