తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: మరింత తగ్గిన బంగారం ధర.. నేడు తులం రేటు ఎంతంటే!

Gold Price Today: మరింత తగ్గిన బంగారం ధర.. నేడు తులం రేటు ఎంతంటే!

12 January 2023, 6:12 IST

    • Gold price Today: బంగారం ధర మరింత శాంతించింది. ఇటీవలికాలంలో పెరుగుతూనే పోగా.. కాస్త ఉపశమనం కలిగింది. వెండి ధర కూడా నేడు స్వలంగా తగ్గింది. బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today: నేటి బంగారం ధరలు ఇలా..
Gold Price Today: నేటి బంగారం ధరలు ఇలా.. (REUTERS)

Gold Price Today: నేటి బంగారం ధరలు ఇలా..

Gold Price Today: దేశంలో బంగారం ధర వరుసగా రెండో రోజు తగ్గింది. దీంతో పసిడి కొనాలనుకునే వారికి కాస్త ఉశమనం లభించింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) గోల్డ్ రేటు నేడు (జనవరి 12) రూ.150 తగ్గి రూ.51,300కు చేరింది. 24 క్యారెట్ల పసిడి కూడా స్వల్పంగా దిగి వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.170 క్షీణించి.. రూ.55,960కు చేరింది. మార్కెట్‍లో నేడు వెండి కూడా ఇదే బాటపట్టింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‍లో..

Gold Price in Hyderabad: హైదరాబాద్‍తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ నేడు పసిడి ధర తగ్గుదల ప్రభావం ఉంది. హైదరాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,300గా ఉంది. 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.55,960కు దిగివచ్చింది. విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలోనూ ధరలు ఇలాగే ఉన్నాయి.

ఢిల్లీలో పాటు ఇతర నగరాల్లో..

Gold Price in Delhi: ఢిల్లీలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు నేడు రూ.51,450కు దిగిచ్చింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రూ.56,110 ధరకు అందుబాటులో ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.51,300గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,960కు చేరింది. కోల్‍కతా, భువనేశ్వర్, నాగ్‍పూర్, కటక్‍లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

బెంగళూరు, అహ్మదాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,350కు వచ్చింది. 24 గ్రాముల తులం గోల్డ్ రేటు రూ.56,010గా ఉంది. తమిళనాడు విషయానికి వస్తే, చెన్నైలో 22 గ్రాముల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.52,300గా ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.57,050 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‍లో..

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్‍లో పరుగులు పెట్టిన ముడి బంగారం ధర నేడు కాస్త స్తబ్ధుగా ఉంది. వరల్డ్ మార్కెట్‍లో ‘స్పాట్ గోల్డ్’ ఔన్సు ధర ప్రస్తుతం 1,877 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డిమాండ్ పెరుగుతుండటంతో గోల్డ్ రేటు అధికమవుతోంది. అమెరికా ఫెడ్ వడ్డీరేటుపై అంచనాలు, ద్రవ్యోల్బణంతో పాటు మరిన్ని అంశాలు బంగారంపై ఎఫెక్ట్ చూపుతున్నాయి.

స్వల్పంగా దిగొచ్చిన వెండి

Silver Price Today: మూడో రోజుల పాటు స్థిరంగా కొనసాగిన వెండి ధరలో నేడు (జనవరి 12) మార్పు వచ్చింది. బులియన్ మార్కెట్‍లో కిలో వెండి ధర రూ.300 తగ్గి రూ.71,500కు చేరింది. 100 గ్రాముల వెల రూ.7,150గా ఉంది.

Silver price: హైదారాబాద్ మార్కెట్‍లో నేడు కిలో వెండి ధర రూ.74,000కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ఇదే ధర ఉంది. మరోవైపు, దేశరాజధాని ఢిల్లీలో కిలో వెండి వెల రూ.71,500గా ఉంది. కోల్‍కతా, అహ్మదాబాద్‍, ముంబై, లక్నోలోనూ ఇదే ధర ఉంది.