తెలుగు న్యూస్  /  Business  /  Gold Price In India Hikes Today By 110 Rupees To 61910 For 10 Grams Silver Rate Also Gain

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి కూడా పైకి.. నేటి రేట్లు ఇవే!

17 May 2023, 5:42 IST

    • Gold Price Today: బంగారం రేటు మరోసారి పెరుగదల బాట పట్టింది. వెండి రేటు కూడా అధికమైంది. దేశంలోని వివిధ సిటీల్లో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి కూడా పైకి.. నేటి రేట్లు ఇవే!
Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి కూడా పైకి.. నేటి రేట్లు ఇవే!

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి కూడా పైకి.. నేటి రేట్లు ఇవే!

Gold Price Today: దేశీయ మార్కెట్‍లో వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న పసిడి (Gold) ధర మరోసారి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో బంగారం రేటు స్వల్పంగా అధికమైంది. బుధవారం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.100 పెరిగి రూ.56,750కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం రేటు రూ.110 అధికమై రూ.61,910కి వెళ్లింది. కాగా, వెండి ధర కూడా దేశీయ మార్కెట్‍లో పెరిగింది. దేశంలోని వివిధ ప్రధాన సిటీల్లో బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices) ఎలా ఉన్నాయంటే..

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Gold Rate Today in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.56,900కు వెళ్లింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ వెల రూ.62,060కు ఎగబాకింది.

Gold Rate today in Hyderabad: హైదరాబాద్‍‍ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,750కు చేరింది. 24 క్యారెట్ల చెందిన 10 గ్రాముల పసిడి రేటు రూ.61,910కు ఎగిసింది. ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోనూ ఇవే రేట్లు నమోదయ్యాయి.

Gold Price Today in Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.56,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ధర రూ.61,960కు ఎగబాకింది. అహ్మదాబాద్‍లోనూ ఇదే ధర ఉంది.

Gold Price Today: ముంబై, కోల్‍కతా నగరాల్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.56,750కు ఎగిసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ వెల రూ.61,910కు వెళ్లింది. తమిళనాడు క్యాపిటల్ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,180కు, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.62,380కు చేరింది.

Gold Rate Today: అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభంపై ఆందోళనలు మరోసారి తగ్గుతుండడం, డాలర్ విలువలో స్థిరత్వం వస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్‍లో బంగారం ధర మళ్లీ కాస్త దిగివస్తోంది. గత 24 గంటల్లో ఒకటిన్నర శాతం వరకు తగ్గింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,989 డాలర్ల వద్ద ఉంది. మరోసారి 2,000 డాలర్ల దిగువకు వచ్చింది.

వెండి ధర కూడా జంప్

Silver Rate Today: దేశంలో నేడు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.300 అధికమై రూ.75,100కు చేరింది. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.78,800కు ఎగిసింది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబై, అహ్మదాబాద్ సిటీల్లో కిలో వెండి రేటు రూ.75,100గా నమోదైంది.

(గమనిక: ఈ ధరల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)