తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

Gold and silver rates today : పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

02 December 2022, 6:20 IST

    • Gold and silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (MINT_PRINT)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి.. రూ. 48,750కి చేరింది. గురువారం ఈ ధర రూ. 48,550గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2,000 పెరిగి, రూ. 4,87,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 4,875గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

iQOO Z9x launch : ఇండియాలో ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 210 వృద్ధి చెంది.. రూ. 53,180కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 52,970గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2,100 పెరిగి.. రూ. 5,31,800గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,330గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 53,180గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 49,550గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 54,050గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 48,750గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 53,180గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,750గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,180గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,800గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 53,230గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,750గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,180గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,360గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 2,200 పెరిగి 63,600కి చేరింది. గురువారం ఈ ధర రూ. 61,400గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 69,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 63,600.. బెంగళూరులో రూ. 69,800గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)