Gold rate today: బంగారం.. స్థిరం, వెండి పైకి.. నేటి ధరలు ఇవే-gold rates today settled flat silver hike know latest latest prices in hyderabad delhi ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Rates Today Settled Flat Silver Hike Know Latest Latest Prices In Hyderabad Delhi

Gold rate today: బంగారం.. స్థిరం, వెండి పైకి.. నేటి ధరలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 01, 2022 06:09 AM IST

Gold rate today: పసిడి ధర నేడు స్థిరంగా ఉంది. వెండి మాత్రం పైకి ఎగబాకింది. ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold rate today: నేటి బంగారం, వెండి ధరలు ఇవే
Gold rate today: నేటి బంగారం, వెండి ధరలు ఇవే

Gold rate today: దేశంలో నేడు (డిసెంబర్ 1) పసిడి ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550గా ఉంది. గ్రాము గోల్డ్ రూ.4,855కు లభిస్తోంది. 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర కూడా నేడు స్తబ్దుగానే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.52,970గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్‍లో..

Today Gold Price Hyderabad: హైదరాబాద్‍లో 22 క్యారెట్ల పసిడి ధర స్థిరంగానే ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేట్ మాత్రం కాస్త పెరిగింది. భాగ్యనగరంలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల వెల రూ.53,850కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.52,970గా ఉంది.

Gold rate today: ఇతర ప్రధాన నగరాల్లో..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,700కు చేరగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రూ.53,130గా ఉంది. జైపూర్, లక్నోలోనూ ఇవే ధరలు ఉన్నాయి. కోల్‍కతా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల (10 గ్రాములు) గోల్డ్ రేట్ రూ.49,360గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల వెల రూ.53,850కు చేరింది. బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,600, 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.53,020 వద్ద ఉంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ గోల్డ్ ధర పైకి ఎగబాకుతోంది. స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 27 డాలర్ల వరకు పెరిగి ప్రస్తుతం 1,776 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై ఆసక్తి నెలకొన్ని తరుణంలో అంతర్జాతీయ మార్కెట్‍లో గోల్డ్ పైకి వెళుతోంది. ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా ప్రభావం చూపుతున్నాయి.

నేటి వెండి ధరలు

Silver Rate Today: భారత్‍లో నేడు పసిడి స్థిరంగా ఉండగా.. వెండి మాత్రం పైకి ఎగబాకింది. కేజీ వెండిపై రూ.900 పెరిగింది. దీంతో దేశీయ బులియన్ మార్కెట్‍లో కేజీ వెండి ధర నేడు రూ.62,300గా ఉంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖట్నం, బెంగళూరు, చెన్నై నగరాల్లో కేజీ వెండి రేట్ రూ.68,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,300కు చేరింది. ముంబై, కోల్‍కతా, పుణె, అహ్మదాబాద్‍లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ప్లాటినం ధరలు ఇలా..

Platinum Price today: దేశంలో ప్లాటినం ధర బాగా పెరిగింది. 10 గ్రాముల ప్లాటినంపై రూ.530 ధర అధికమవగా.. ప్రస్తుత ధర రూ.26,180కు చేరింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇవే విధంగా ప్లాటినం ధర ఉంది.

WhatsApp channel