తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 06 January 2023 Check Latest Prices In Telugu

Gold and silver rates today : మళ్లీ పెరిగిన పసిడి ధర- రూ. 51,000పైనే గోల్డ్​!

06 January 2023, 6:34 IST

    • Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు పెరిగాయి, వెండి ధరలు తగ్గాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (PTI)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి.. రూ. 51,300కి చేరింది. గురువారం ఈ ధర రూ. 51,100గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2000 పెరిగి, రూ. 5,13,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,130గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Cibil score : జీవితంలో ఎప్పుడూ లోన్​ తీసుకోకపోయినా.. సిబిల్​ స్కోర్​పై ఎఫెక్ట్​ పడుతుందా?

Mahindra XUV 3XO vs Tata Nexon : ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్​ నెక్సాన్​.. ఏది బెస్ట్​?

Stocks to buy today : ఈ రూ. 98 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో మంచి ప్రాఫిట్స్​..!

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 210 వృద్ధి చెంది.. రూ. 55,960కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 55,750గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2710 పెరిగి.. రూ. 5,59,600గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,450గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,110గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,300 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 55,960గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,280గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,030గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 51,300గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 55,960గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 51,300గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 55,960గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 51,350గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 56,010గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 51,300గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 55,960గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,200గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 72,000గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధరల పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 72,000.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 370 తగ్గి.. రూ. 28,540గా ఉంది. క్రితం రోజు ఈ ధర రూ. 28,910గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,540గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)