తెలుగు న్యూస్  /  Business  /  Gold Rate Today Gains Know Latest Prices Of Gold And Silver

Gold Rate Today: పసిడి ధర మరింత పైకి.. ఆ మార్కును కూడా దాటేసి..

05 January 2023, 6:09 IST

    • Gold Rate Today: దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. నేడు కూడా పసిడి ధర అధికమైంది. దీంతో రికార్డుస్థాయికి చేరింది. వెండి ధర స్థిరంగా ఉంది. ప్రధాన నగరాల్లో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
Gold Rate Today: పసిడి ధర మరింత పైకి.. ఆ మార్కును కూడా దాటేసి..
Gold Rate Today: పసిడి ధర మరింత పైకి.. ఆ మార్కును కూడా దాటేసి.. (PTI)

Gold Rate Today: పసిడి ధర మరింత పైకి.. ఆ మార్కును కూడా దాటేసి..

Gold Price Today: దేశీయ మార్కెట్‍లో పసిడి ధర పైకి ఎగబాకుతూనే ఉంది. కిందటి రోజున బంగారం ధర భారీగా పెరగగా.. నేడు (జనవరి 5) కూడా అదే అదే కొనసాగింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) బంగారం ధర నేడు రూ.150 పెరిగి.. రూ.51,100కు ఎగబాకింది. ఈ ధర రూ.51మార్కును దాటడం ఇదే తొలిసారి. 24 క్యారెట్ల పసిడి రేటు కూడా కొత్త గరిష్ఠానికి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 పెరిగి.. రూ.55,750కు చేరింది. ప్రధాన నగరాల్లో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో..

Gold Price today: తెలుగు రాష్ట్రాల్లోనూ నేడు పసిడి పరుగులు ఆగలేదు. హైదరాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.55,750కు పెరిగింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోనూ ఇదే రీతిలో ధరలు ఉన్నాయి.

దేశంలోని ఇతర సిటీల్లో..

Gold Price Today: దేశవ్యాప్తంగా కూడా బంగారం ధర పైకి పరుగులు పెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి వెల రూ.51,250కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.55,900కు ఎగబాకింది. కోల్‍కతాలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.55,750కు ఎకబాకింది. ముంబై, కేరళలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

అహ్మదాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.51,150కు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.55,800కు ఎగబాకింది. బెంగళూరు, పట్నాలో ఇదే ధర ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వెల రూ.52,380కేు చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గల్డ్ ధర రూ.57,140కు ఎగబాకింది.

అంతర్జాతీయ మార్కెట్‍లో..

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‍లో ముడి బంగారం ధర కూడా పరుగులు పెడుతూనే ఉంది. నేడు స్పాట్ బంగారం ఔన్సు ధర ఏకంగా 18.68 డాలర్లు పెరిగి 1,855 డాలర్ల వద్దకు చేరుకుంది. అమెరికా ఫెడ్ వడ్డ రేట్ల భయాలతో మదుపరులు పసిడి వైపు చూస్తుండటంతో డిమాండ్ పెరిగి, ధర కూడా ఎగబాకుతోంది. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే ఉంది.

వెండి స్థిరంగా..

Silver Rate Today: బంగారం ధరలు పెరగగా.. నేడు వెండి ధరకు నేడు కాస్త బ్రేకులు పడ్డాయి. స్థిరంగా కొనసాగాయి. నేడు కిలో వెండి ధర రూ.72,000గా ఉంది. కిందటి రోజున రూ.700 పెరిగి ఈ మార్కుకు చేరింది వెండి.

హైదరాబాద్‍లో నేడు కిలో వెండి ధర రూ.75,500గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, కేరళ, చెన్నైలోనూ ఇదే ధర ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,000 వద్ద కొనసాగింది. కోల్‍కతా, అహ్మదాబాద్‍, లక్నో, సూరత్‍లోనూ ఇదే విధంగా ధర ఉంది.