తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate Today: గోల్డ్ రష్: భారీగా పెరిగిన బంగారం ధర.. రికార్డుస్థాయికి.. వెండి కూడా..

Gold Rate Today: గోల్డ్ రష్: భారీగా పెరిగిన బంగారం ధర.. రికార్డుస్థాయికి.. వెండి కూడా..

04 January 2023, 6:07 IST

    • Gold Price Today: బంగారం ధర ఒక్కసారిగా షాకిచ్చింది. భారీగా పెరిగి కొత్త గరిష్ఠానికి చేరింది. వెండి కూడా అదే బాటలో పయనించింది. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today: గోల్డ్ రష్: భారీగా పెరిగిన బంగారం ధర.. రికార్డుస్థాయికి.. వెండి కూడా..
Gold Rate Today: గోల్డ్ రష్: భారీగా పెరిగిన బంగారం ధర.. రికార్డుస్థాయికి.. వెండి కూడా.. (PTI)

Gold Rate Today: గోల్డ్ రష్: భారీగా పెరిగిన బంగారం ధర.. రికార్డుస్థాయికి.. వెండి కూడా..

Gold Rate Today: బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి. దేశీయ మార్కెట్‍లో పసిడి పరుగులు పెడుతూనే ఉంది. దీంతో గోల్డ్ రేట్లు కొత్త గరిష్ఠానికి చేరాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర నేడు (జనవరి 4) రూ.500 పెరిగి.. రూ.50,950కు చేరింది. రూ.51వేల సమీపానికి వచ్చింది. 24 క్యారెట్ల నాణ్యత కలిగిన పసిడిదీ అదే తీరు. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల ధర నేడు రూ.540 పెరిగి.. రూ.55,580కు ఎగబాకింది. దీంతో రికార్డు స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర కూడా అమాంతం పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‍లో..

Gold Price today in Hyderabad: హైదరాబాద్ మార్కెట్‍లోనూ నేడు బంగారం ధర అమాంతం పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.50,950కి చేరింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి వెల రూ.55,580కు ఎగబాకింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోనూ ఇదే ధరలు ఉన్నాయి.

ఇతర ప్రధాన నగరాల్లో..

Gold Price Today : దేశరాజధాని ఢిల్లీతో పాటు అన్ని నగరాల్లో పసిడి రేటు నేడు బాగా అధికమైంది. ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,100కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.55,730కు పెరిగింది. ముంబై, కోల్‍కతా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,950కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.55,580గా ఉంది.

బెంగళూరులోనూ పసిడి రూ.51వేల మార్కును దాటింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆ నగరంలో రూ.51,000కు చేరింది. 24 క్యారెట్లకు (10 గ్రాములు) చెందిన పసిడి ధర రూ.55,630కు ఎగబాకింది. అహ్మదాబాద్‍లోనూ ఇదే ధర ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,660గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‍లో ఇటీవల కాస్త శాంతించినట్టు కనిపించిన స్పాట్ గోల్డ్ ధర మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం ఔన్స్ స్పాట్ బంగారం ధర 1838.71 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా మెరుగవటం లేదు. దీంతో ఈ ప్రభావం పసిడి ధరపై పడుతోంది. వీటితో పాటు ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ కూడా బంగారంపై పడుతోంది.

వెండి కూడా పైపైకి..

Silver Rate Today in India: దేశీయ బులియన్ మార్కెట్‍లో నేడు వెండి ధర కూడా పైకి పరుగులు తీసింది. కిలో వెండి ధర రూ.700 పెరిగి రూ.72,000కు చేరింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుల్లో కిలో వెండి ధర రూ.75,500కు ఎగబాకింది. ఢిల్లీ, కోల్‍కతా, అహ్మదాబాద్‍లో కిలో వెండి ధర రూ.72,000గా ఉంది.

తదుపరి వ్యాసం